ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: లీటరు నూనె ఫ్రీ ఇస్తామని చెప్పి మోసం.. బ్లింకిట్‌పై కస్టమర్ ఆరోపణ

ABN, Publish Date - Dec 29 , 2024 | 03:07 PM

బ్లింకిట్ అనైతిక చర్యలకు పాల్పడుతోందంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: బ్లింకిట్ అనైతిక చర్యలకు పాల్పడుతోందంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. లీటరు నూనె ఫ్రీగా వస్తుందని చెబితే నమ్మి చివరకు మోసపోయానంటూ సదరు వ్యక్తి నెట్టింట పోస్టు చేశారు.

‘‘5 లీటర్ల నూనె రూ.1072కు కొంటే లీటరు నూనె ఫ్రీ అని యాప్‌లో ప్రకటన చూశాను. ఆ మేరకు ఆర్డరిచ్చాను. కానీ డెలివరీ ఏజెంట్ మాత్రం కేవలం 5లీటర్లే ఇచ్చి వెళ్లాడు’’ అని సదరు వ్యక్తి రెడిట్ పేజీలో కామెంట్ చేశాడు (Viral).

Viral: ఖతర్ యువరాణి తన ప్రేమలో పడిందనుకుని భార్యకు విడాకులు! చివరకు జైలుపాలు!


బ్లికింట్‌కు ఫిర్యాదు చేస్తే కేవలం రూ,.100 కూపన్ మాత్రమే తిరిగిస్తామని అన్నారని ఆ కస్టమర్ వాపోయాడు. ‘‘మేము బ్లింకిట్‌కు ఫిర్యాదు చేశాము. ఉచితంగా నూనె ఇవ్వనైనా ఇవ్వాలి లేదా మొత్తం డబ్బులు వాపసు చెల్లించామని డిమాండ్ చేశాము. కానీ వాళ్లు మాత్రం రూ.100ల కూపన్ మాత్రమే ఇస్తామని చెప్పారు. అంతకుమించి ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని అన్నారు’’ అని అన్నారు.

Viral: కెనడాలో చెల్లాచెదురుగా చెత్త బ్యాగులు.. భారతీయులను బాధ్యుల్ని చేస్తూ పరోక్ష విమర్శలు


బ్లింకిట్ తన కస్టమర్ల విషయంలో ఎటువంటి బాధ్యత లేనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించాడు. లీటరు ఉచిత ఆయిల్ ప్యాకెట్‌కు ఎటువంటి ధర లేదు కాబట్టి ఇంతకు మించిచేసేదేమీ లేదని వారు అన్నట్టు వివరించారు. ఇలాంటి ఫ్రాడ్ ఘటనల విషయంలో కస్టమర్లు చేపట్టాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా అని నెటిజన్లను ప్రశ్నించాడు. ‘‘ఈ ఫ్రాడ్ గమనించని కస్టమర్ల నుంచి బ్లింకిట్ రూ.178 పొందుతుంది. ఇది గమనించిన వారికి రూ.100 ఇచ్చి మిగతా రూ.78 తను పొందుతుంది’’ అని ఆరోపించారు.

ఆ తరువాత సమస్యను బ్లింకిట్ సపోర్టు పేజీలో ప్రస్తావించడంతో వారు స్పందించారని రూ.180ల రిఫండ్ ఇచ్చారని పేర్కొన్నారు. ‘‘నాకు రూ.180ల రిఫండ్ ఇచ్చారు. అయితే, ఒన్ టైం స్పెషల్ పర్మిషన్ కింద నాకు ప్రత్యేక మినహాయింపు ఇచ్చినట్టు చెబుతున్నారు’’ అని చెప్పుకొచ్చారు. దీంతో, ఈ ఉదంతంపై నెట్టింట ప్రస్తుతం చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

Viral: లిప్‌స్టిక్ పెట్టుకునేందుకు రూ.27 లక్షల బ్యాగు కొనుగోలు

Viral: స్పోర్ట్స్ షూ వేసుకుని ఆఫీసుకు వచ్చినందుకు ఊస్టింగ్.. బాధితురాలికి రూ.32 లక్షల పరిహారం!

Read Latest and Viral News

Updated Date - Dec 29 , 2024 | 03:08 PM