ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి సైకిల్ ఎక్కడైనా చూశారా.. కొనేందుకు డబ్బులు లేక.. చివరకు ఎలా తయారు చేశాడో తెలిస్తే..

ABN, Publish Date - Sep 13 , 2024 | 08:02 PM

కొందరు బైకులు, సైకిళ్లను చిత్రవిచిత్రంగా తయారు చేయడం చూస్తుంటాం. సైకిల్‌కు ట్రాక్టర్ టైర్లను జాయింట్ చేస్తూ కొందరు, బైకులను ఆటోలుగా మార్చుతూ ఇంకొందరు వివిధ రకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే మరికొందరు ఎవరూ చేయలేని ప్రయోగాలను చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి..

కొందరు బైకులు, సైకిళ్లను చిత్రవిచిత్రంగా తయారు చేయడం చూస్తుంటాం. సైకిల్‌కు ట్రాక్టర్ టైర్లను జాయింట్ చేస్తూ కొందరు, బైకులను ఆటోలుగా మార్చుతూ ఇంకొందరు వివిధ రకాలుగా ప్రయోగాలు చేస్తుంటారు. అలాగే మరికొందరు ఎవరూ చేయలేని ప్రయోగాలను చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తయారు చేసిన సైకిల్‌ను చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఇలాంటి సైకిల్‌ను ఎన్నడూ చూడలేదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బీహార్‌లోని (Bihar) సమస్తిపూర్‌కు చెందిన ఓ యువకుడు తయారు చేసిన సైకిల్ చూసి అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాత సైకిల్ విడి భాగాల్లో కొన్నింటిని తీసుకున్న అతను మిగతా విడి భాగాలను వెదురు కర్రలతో (bicycle Making with bamboo sticks) తయారు చేశాడు. రెండు చక్రాలకు మధ్యలో జాయింట్ చేసే ఇనుప రాడ్ల స్థానంలో వెదరు కర్రలను సిద్ధం చేశాడు. అది కూడా అచ్చం సైకిల్ వస్తువుల తరహాలోనే రూపొందిచాడు.

Viral Video: పెట్రోల్ బంక్‌‌లోకి వచ్చిన సింహం.. చివరకు ఏం జరిగిందో చూడండి..


అలాగే సైకిల్ సీటు స్థానంలో మందపాటి వెదురును ఏర్పాటు చేశాడు. చివరగా ముందు హ్యాండిల్ స్థానంలో ఎద్దు కొమ్ముల తరహాలో వెదురు కర్రలను ఫిట్ చేశాడు. ఇలా దాదాపు చాలా వరకు వెదురు కర్రలతోనే సైకిల్ రూపొందించాడు. ముందు వైపు భారత దేశ జాతీయ జెండాలను ఏర్పాటు చేసి, చివరగా ఆ సైకిల్ ఎలా పని చేస్తుందో పరీక్షించాడు. రోడ్డుపై అటూ, ఇటూ నడిపి చూశాడు. ఈ వెదురు కర్రల సైకిల్‌ను చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వినూత్న సైకిల్‌‌ను తాను 25 రోజుల్లేనే తయారు చేసినట్లు సదరు యువకుడు తెలిపాడు.

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వర్షంలో తడిస్తే ఈ సైకిల్ పరిస్థితి ఏంటో’’.., ‘‘బీహార్‌లో ఇలాంటి టాలెంట్‌కు కొదవే లేదు’’..,‘‘వెదురు సైకిల్ బాగానే ఉంది గానీ.. బ్రేక్ వేయాలంటే ఏం చేస్తావ్ బ్రో’’.., ‘‘ఈ సైకిల్ సీటుపై కూర్చోవాలంటే సాహసం చేయాల్సిందే’’.., ‘‘ఇతను అభివృద్ధిలో వెనక్కు వెళ్తున్నట్లు ఉంది’’.. అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చుట్టుముట్టిన సింహాలతో జిరాఫీ పోరాటం.. చూస్తుండగానే అంతెత్తుకు జంప్ చేసిన సింహాలు.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో.. రైలు ఎక్కించేందుకు సాయం చేయాలని చూడగా.. చివరకు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 13 , 2024 | 08:02 PM

Advertising
Advertising