ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: గుండె దడ పుట్టించే సీన్.. కొండ అంచున్న బైక్ రైడ్.. చూస్తుండగానే..

ABN, Publish Date - Jul 20 , 2024 | 05:53 PM

సాహసాల పేరుతో కొందరు ప్రాణాలకు తెగిస్తుంటే.. మరికొందరు ప్రమాదమని తెలిసి కూడా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. బైక్ రైడర్లు చాలా మంది ..

సాహసాల పేరుతో కొందరు ప్రాణాలకు తెగిస్తుంటే.. మరికొందరు ప్రమాదమని తెలిసి కూడా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. బైక్ రైడర్లు చాలా మంది కొండ ప్రాంతాల్లో రైడింగ్ చేయడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. కొండ అంచున బైక్ రైడ్ చేస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు బైకర్లు (Bikers ride on hill) కొండ ప్రాంతంలో రైడ్ చేస్తుంటారు. అయితే ఈ సందర్భంగా వారు కొండ పైకి వెళ్లారు. అంతటితో ఆగకుండా కొండ అంచున సక్రమంగా లేని దారిలో రైడ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మధ్యలో బైకు పట్టేంత దారి కూడా లేకపోవడంతో ఆగిపోయారు.

Viral Video: వేట కోసం చెట్టుపై సింహం, చిరుత భీకర పోరు.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


అయితే వారిలో ఓ వ్యక్తి అదే దారిలో ముందుకు వెళ్లేందుకు సాహసించాడు. అతడికి ముందు, వెనుక ఇద్దరు బైకర్లు వీడియో తీస్తుండగా.. ఆ యువకుడు బైక్‌ను స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు. కాస్త దూరం వెళ్లగానే బైకు అదుపు తప్పి ఒక్కసారిగా లోయలోకి పడిపోయింది. అక్కడే ఉన్న వారు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. బైకుతో పాటే అతను కూడా (Biker fell from the hill into the valley) పల్టీలు కొట్టుకుంటూ లోయలోకి పడిపోయాడు.

Viral Video: హైహీల్స్‌తో వ్యవసాయం.. ఈ మహిళల ట్రిక్ మామూలుగా లేదుగా..


చూస్తుండగానే ఆ యువకుడు లోయ కిందకు వరకూ గింగిరాలు తిరుగుతూ వెళ్లాడు. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కొందరు బతికే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సాహసాలు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: సింహాలను మేతకు తోలుకెళ్లిన వ్యక్తి.. చివరకు అక్కడ జరిగింది చూసి ఖంగుతిన్న జనం..

Updated Date - Jul 20 , 2024 | 05:53 PM

Advertising
Advertising
<