ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రోడ్డుపై రెయిన్ సాంగ్ చేస్తున్న మహిళ.. వెనుక నుంచి ఉన్నట్టుండి ఊహించని షాక్.. చివరకు..

ABN, Publish Date - Aug 06 , 2024 | 10:22 AM

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వయసుతో సబంధం లేకుండా చాలా మంది యువతీయువకులు రీల్స్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇలాంటి వారిని చూసి మిగతా వారు కూడా ..

ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వయసుతో సబంధం లేకుండా చాలా మంది యువతీయువకులు రీల్స్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇలాంటి వారిని చూసి మిగతా వారు కూడా నేమ్, ఫేమ్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో వారికి అనేక షాకింగ్ అనుభవాలు ఎదురువుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి రోడ్డుపై రెయిన్ సాంగ్ చేస్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రీల్స్ (Reels) చేసే వారు తమకు అనుకూలంగా ఉన్న ఎలాంటి సమయాన్ని అయినా ఇట్టే వాడేసుకుని వీడియోలు చేస్తుంటారు. ఇలాంటి వారు వర్షాకాలంలో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ రీల్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

Viral Video: వయసు మూడేళ్లే అయినా.. ఇతడు చేసిన పని చూస్తే.. అభినందించకుండా ఉండలేరు..


సదరు యువతి రోడ్డుపై రీల్స్ వీడియోలు చేసేందుకు సిద్ధమైంది. కెమెరా ఆన్ చేయగానే డాన్స్ వేసుకుంటూ (woman dancing on road) రోడ్డుకు అటు వైపు వెళ్లింది. అక్కడ నిలబడి నాలుగు స్టెప్పులు వేసి, ఆ తర్వాత మళ్లీ డాన్స్ చేసుకుంటూ కెమెరా వైపు వస్తోంది. అదే సమయంలో కాస్త దూరంలో ఓ వ్యక్తి బైకులో వస్తుంటాడు. చివరకు అతను యువతి సమీపానికి వచ్చి వేగంగా వెళ్తాడు. దీంతో రోడ్డుపై ఉన్న వరద నీళ్లన్నీ ఆమెపై పడతాయి. నీళ్లు పడగానే షాకైన ఆమె.. వెనక్కు తిరిగి చూస్తుంది. చివరకు అసలు విషయం తెలుసుకుని అవాక్కవుతుంది.

Viral Video: వంటింట్లో భర్తకు షాక్ ఇచ్చిన భార్య.. ఇలాంటి టాలెంట్ ఈమెకు మాత్రమే సాధ్యమేమో..


ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘యువతికి తిక్క బాగా కుదిరింది’’.. అంటూ కొందరు, ‘‘రోడ్డుపై ఈ పిచ్చి డాన్సులేంటీ.. ఈమెకు ఇలాగే జరగాలి’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.30లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చూస్తుండగానే మాయమైన రోడ్డు.. దడ పుట్టిస్తున్న 52 సెకన్ల వీడియో..

Updated Date - Aug 06 , 2024 | 10:22 AM

Advertising
Advertising
<