Viral Video: అనవసరంగా అడవి దున్నతో పెట్టుకున్నాడే.. చివరికి ఇతడి పరిస్థితి ఏమైందంటే..
ABN, Publish Date - Apr 09 , 2024 | 07:50 PM
కొందరి ఆకతాయి చేష్టలు ఎదుటి వారికి ప్రాణ సంకటంగా మారుతుంటాయి. మరికొన్నిసార్లు ఎదుటివారితో పాటూ వారి ప్రాణాల మీదకూ వస్తుంటుంది. కొందరు జంతువులను అసవసరంగా కెలికి.. చివరకు వాటి దాడికి గురవుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు...
కొందరి ఆకతాయి చేష్టలు ఎదుటి వారికి ప్రాణ సంకటంగా మారుతుంటాయి. మరికొన్నిసార్లు ఎదుటివారితో పాటూ వారి ప్రాణాల మీదకూ వస్తుంటుంది. కొందరు జంతువులను అసవసరంగా కెలికి.. చివరకు వాటి దాడికి గురవుతుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఆవేశంగా ఉన్న అడవి దున్నను ఓ వ్యక్తి అనవసంగా కెలికాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అడవి దున్న అటవీ ప్రాంత సమీప ప్రాంతంలోకి చొరబడుతుంది. ఆ సమయంలో ఇళ్ల పరిసరాల్లో ఎవరూ ఉండరు. దీంతో అడవి దున్న ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తి.. అడవి దున్నను అనవసరంగా కెలుకుతాడు. దాన్ని రెచ్చగొట్టి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తాడు. దీంతో దున్నకు కోపం కట్టలు తెంచుకుంటుంది. ఎదురుగా వెళ్లి అతన్ని కొమ్ములతో (bison attacked man) పొడిచే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో అతడి టోపీ ఎగిరి పక్కన పడుతుంది. తర్వాత అడవి దున్న టోపీని కొమ్ములతో పొడుస్తుంది.
Viral Video: పార్క్‌లోని బెంచిపై షాకింగ్ సీన్.. అర్ధరాత్రి పోలీసులు వచ్చి చూడగా.. చివరకు..
ఆ తర్వాత అక్కడే ఉన్న వ్యక్తి పైకి మరింత ఆవేశంగా వెళ్లి కొమ్ములతో పైకి ఎత్తి ధబేల్‌మని కింద పడేస్తుంది. కింద పడ్డ ఆ వ్యక్తి తర్వాత అక్కడి నుంచి పారిపోతాడు. కాగా, ఈ ఘటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ అడవి దున్న ఆవేశం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘జంతువులను అనవసరంగా ఇబ్బంది పెడితే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 26 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: నడుస్తూ వెళ్తున్నా.. తప్పని ప్రమాదం.. అయినా ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..
Updated Date - Apr 09 , 2024 | 07:50 PM