ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇలాంటి పడవను ఎక్కడైనా చూశారా.. వర్షం వస్తే దీని పరిస్థితి ఏంటో..

ABN, Publish Date - Aug 09 , 2024 | 07:49 AM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అందరిలా కాకుండా విచిత్రమైన పడవను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఇందుకోసం విచిత్రంగా ఇంట్లోని వస్తువులను సిద్ధం చేశాడు. చివరకు అతడు తయారు చేసిన పడవను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘వర్షం వస్తే.. ఈ పడవ పరిస్థితి ఏంటో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..

కొందరు విచిత్రమైన ఐడియాలతో చిత్రవిచిత్రమైన వస్తువులు తయారు చేయడంలో ముందుంటారు. ఇలాంటి విచిత్ర ప్రయోగాలను చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. సైకిళ్లను బైకులుగా, బైకులను ఆటోలుగా, ఆటోలను కార్ల తరహాలో మార్చడం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా, వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఓ వ్యక్తి వంటపాత్రలతో విచిత్రమైన పడవను తయారు చేశాడు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘వర్షం వస్తే ఈ పడవ పరిస్థితి ఏంటో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అందరిలా కాకుండా విచిత్రమైన పడవను తయారు చేయాలని నిర్ణయించుకున్నట్లున్నాడు. ఇందుకోసం విచిత్రంగా ఇంట్లోని వంటపాత్రలను సిద్ధం చేశాడు. పెద్ద పెద్ద వంట పాత్రలను చుట్టూ ఉంచి, వాటికి వెదురు కర్రలను కట్టాడు. ఇలా చివరకు (boat made of cooking pots and bamboo sticks) పెద్ద పడవను తయారు చేశాడు.

Viral Video: కాలం కలిసిరాకపోవడం అంటే ఇదేనేమో.. వీధిలోకి వచ్చిన మొసలికి.. చివరికి ఎలాంటి గతి పట్టిందంటే..


చివరగా ఆ పడవను ప్రయోగించేందుకు సిద్ధమయ్యాడు. ఈ వంటపాత్ర పడవపై ముగ్గురు చిన్నారులతో పాటూ పెద్ద వారు కూడా కూర్చున్నారు. చివవరకు పడవైతే నీటిలో దూసుకుపోతూ కనిపించింది. పడవపై కూర్చున్న పిల్లలు కాళ్లను వంట పాత్రల్లో ఉంచి ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: కారు రూఫ్‌పై షాకింగ్ సీన్.. ప్రేమికుల నిర్వాకం చూసి అవాక్కైన వాహనదారులు..


ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇతడి ఐడియా మామూలుగా లేదుగా’’.., ‘‘వర్షం వస్తే ఈ పడవ మునిగిపోవడం ఖాయం’’.., ‘‘స్పీడ్ బోట్.. మేడ్ ఇన్ ఇండియా’’.., ‘‘ఇది బంగ్లాదేశీ హ్యాండ్‌మేడ్ బోట్‌లా ఉందే’’.., ‘‘ఈ పడవ టెస్లా ఆటో డ్రైవ్ మోడ్’’.., ‘‘ఎలా వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు’’.., ‘‘అందులోకి నీళ్లు పోకుండా చూసుకోండి’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

Updated Date - Aug 09 , 2024 | 07:49 AM

Advertising
Advertising
<