Viral: షాకింగ్.. అమెరికా విమానంలో మృతదేహం..
ABN, Publish Date - Dec 26 , 2024 | 09:40 AM
అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో అధికారులకు ఓ గుర్తు తెలియని మృతదేహం లభించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో అధికారులకు ఓ గుర్తు తెలియని మృతదేహం లభించింది. బుధవారం హవాయి ద్వీపంలోని మావుయీ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండయిన తరువాత అధికారులు మృతదేహాన్ని గుర్తించారు. విమానం చక్రాలు ఉండే వీల్ వెల్ అనే భాగంలో మృతదేహం లభించినట్టు తెలిపారు (Viral).
Viral: ఒకే ట్రిప్‌కు రెండు ఫోన్లలో వేర్వేరు చార్జీల ఆరోపణ.. స్పందించిన ఉబర్
ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రకటన ప్రకారం, మంగళవారం చికాగో ఓహారే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్లైట్ 202 విమానం బయలుదేరింది. హవాయీలో దిగాక అధికారులు మృతదేహాన్ని గుర్తించారు. వీల్ వెల్‌లోకి వెళ్లేందుకు విమానం బయట నుంచి ఒకే ఒక మార్గం ఉంటుంది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి విమానంలోకి ఎలా వెళ్లాడనే దానిపై చర్చ జరుగుతోంది.
అక్రమంగా ప్రయాణించే కొందరు విమానం ల్యాండింగ్ గేర్ ఉండే వీల్ వెల్‌లో దాక్కుని ప్రయాణిస్తుంటారని అధికారులు చెబుతున్నారు. అయితే, విమానం గాల్లో ఉన్నప్పుడు ఈ భాగంలో ఉష్ణోగ్రతలు మైనస్ 50 నుంచి మైనస్ 60 సెల్సియస్ డిగ్రీలకు పడిపోతాయి. ఆక్సీజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ భాగంలో ఉన్న వారికి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. వీల్ వెల్‌లో దాక్కుని ప్రయాణించేందుకు ప్రయత్నించిన అనేక మంది గతంలో మరణించారు. అరుదుగా మాత్రమే కొందరు ప్రాణాలతో బయటపడ్డారు.
Viral: పెంపుడు కుక్కను రక్షించేందుకు ప్రాణాలకు తెగించిన యజమాని! షాకింగ్ వీడియో!
కాగా, ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ స్పందించింది. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభమైనట్టు తెలిపింది. అయితే, సదరు వ్యక్తి వీల్ వెల్‌లోకి ఎలా చేరాడో ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. మరోవైపు, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఈ ఘటనపై ఇంకా స్పందించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, గతేడాది ఆల్జీరియా నుంచి పారిస్‌కు వెళ్లిన విమానంలో ఓ వ్యక్తిని గుర్తించారు. వీల్ వెల్‌లో ప్రయాణించినప్పటికీ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. 2022లో ఓ ఆఫ్రికా వ్యక్తి విమానం వీల్ వెల్‌లోకి అక్రమంగా చొరబడి అమస్టర్‌డామ్‌కు చేరుకోగలిగినా చివరకు అధికారులకు చిక్కాడు.
Viral: ఎయిర్ ఇండియాలో సేవాలోపం! లైఫ్‌లో కీలక ఘట్టానికి దూరమైన ప్రయాణికురాలు
Updated Date - Dec 26 , 2024 | 10:32 AM