ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: ఆడ సింహానికి సవాలు విసిరిన బాడీ బిల్డర్! చివరకు ఏమైందో చూస్తే..

ABN, Publish Date - Dec 20 , 2024 | 04:58 PM

ఆడ సింహంతో టగ్ ఆఫ్ వార్ ఆడిన బాడీ బిల్డర్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: సింహాల ధైర్యస్థైర్యాలు, దేహబలం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. వాటి శక్తి, దూడుకు ముందు అడవిలోని అనేక చిన్నాపెద్దా జంతువులు మోకరిల్లుతాయి. అయితే, అడపాదడపా నెట్టింట వైరల్ అయ్యే వీడియోలు మృగరాజుల బలాన్ని మరింత స్పష్టంగా చూపిస్తాయి. ముఖ్యంగా మనుషులకు ఎంత బలం ఉన్నా, జిమ్‌లో కసరత్తులు చేసి ఎంతగా కండలు పెంచినా ఈ క్రూరమృగాల ముందు దిగదుడుపే అన్న విషయం అస్సలు మర్చిపోకూడదు. ఇందుకు సంబంధించి తాజా ఉదాహరణగా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది (Viral).

Viral: విమానం గాల్లో ఉండగా బాత్రూమ్‌లో లీకేజీ.. షాకింగ్ వీడియో


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ వస్తాడు సింహంతో టగ్ ఆఫ్ వార్ ఆట మొదలెట్టాడు. అంటే..తాడుకున్న ఓ అంచును అతడు పట్టుకున్నా మరో అంచును బోనులో ఉన్న ఓ ఆడ సింహం నోటికందించాడు. ఆ తరువాత తాడును సింహం తనవైపునకు లాగేందుకు ప్రయత్నిస్తే బాడీ బిల్డర్ దాన్ని వ్యతిరేక దిశలో లాగే ప్రయత్నం చేశాడు. అయితే, అంతటి భారీకాయుడు తాడును తనవైపునకు లాక్కోలేకపోయాడు. నోట తాడు పట్టిన సింహం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు సరికదా మెల్లగా ఒక్కో అడుగూ వెనక్కు జరుగుతూ బాడీ బిల్డర్‌నూ ముందుకు తూలేలా చేసింది. అతడు ఎంతగా ప్రయత్నించినా సింహం ఒక అంగుళం కూడా ముందుకు కదలలేదు. క్షణాలు గడుస్తున్న కొద్దీ అతడిలో ఓపిక నశించి ముందుకు తూలుతుంటే సింహం మాత్రం క్రమక్రమంగా వెనక్కు జరిగింది.

Viral: డ్రోన్‌ కాఫ్టర్ తయారు చేసిన కుర్రాడు.. ఆనంద్ మహీంద్రా ప్రశంస!


వీడియోను చూసి అనేక మంది సింహం బలానికి ఆశ్చర్యపోయారు. పళ్లతో తాడును బలంగా లాగుతున్న తీరుకు నోరెళ్లబెట్టారు. ఇలంటి సింహం నోటికి మనిషి ఒంటరిగా చిక్కితే బతికి బట్టగలడా అని కొందరు సందేహం వ్యక్తం చేశారు. సింహాల శక్తి, పోరాడే తత్వానికి సాటి రాగల జంతువు మరొకటి ఉండదని అన్నారు. ఆడ సింహమే ఈ రేంజ్ దూకుడు ప్రదర్శిస్తే సహజంగా కోపం ఎక్కువ ఉండే మగ సింహం ఇంకెంత భీకరపోరాటం చేయగలదో ఊహించను కూడా సాధ్యం కాదని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Viral: వామ్మో.. మిల్క్ ప్యాకెట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్ వెనక ఇంత స్టోరీ ఉందా!

Read Latest and Viral News

Updated Date - Dec 20 , 2024 | 04:58 PM