Viral Video: తవ్వకాల్లో బయటపడ్డ మనిషి ఎముక.. మోకాలి వద్ద పరిశీలించగా షాకింగ్ సీన్..
ABN, Publish Date - Dec 15 , 2024 | 09:46 AM
తవ్వకాల్లో కొన్నిసార్లు వింత వింత వస్తువులు బయటపడుతుంటాయి. కొన్నిసార్లు పురాతన వస్తువులు బయటపడితే.. మరికొన్నిసార్లు బంగారు నాణేలు దొరుకుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మానవ ఎముకకు సంబంధించిన వీడియో ఒకటి..
తవ్వకాల్లో కొన్నిసార్లు వింత వింత వస్తువులు బయటపడుతుంటాయి. కొన్నిసార్లు పురాతన వస్తువులు బయటపడితే.. మరికొన్నిసార్లు బంగారు నాణేలు దొరుకుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, మానవ ఎముకకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తవ్వకాల్లో బయటపడిన మానవ ఎముకలో మోకాలి వద్ద పరిశీలించగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తవ్వకాలు జరుపుతుండగా షాకింగ్ సీన్ కనిపించింది. మట్టిలో ఏదో అనుమానాస్పదకంగా కనిపించడతో బయటికి తీయగా.. మానవ ఎముకలు (Human bones) బయటపడ్డాయి. అందులో ఓ ఎముక మోకాలి వద్ద వింత వస్తువు కనిపించింది. గుండ్రంగా ఉన్న ఇనుప వస్తువు ఎముకకు జాయింట్ చేసి ఉండడాన్ని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Viral Video: ఇతడి ప్రయోగం మామూలుగా లేదుగా.. కారు లాంటి ట్రాక్టర్‌ను చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
చివరకు ఏంటా అని పరిశీలించగా.. అది మోకాలి ఆపరేషన్‌లో అమర్చే కీలు అని తెలిసింది. ప్రస్తుతం మోకాలి ఆపరేషన్లలో అధునాత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మోకాలి మధ్యలో కీలు స్థానంలో ఇలా గుండ్రంగా ఉండే ఇంప్లాంట్లను (Knee implant) అమర్చుతారు. ఇది 20 నుంచి 30 సంవత్సరాల వరకూ ఉండేలా తయారు చేస్తారు. శరీరం కుళ్లిపోయినా కూడా ఎముకకు అమర్చిన ఇంప్లాంట్ మాత్రం చెక్కుచెదరకుండా ఉండడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
Viral Video: బాత్రూంలో షాకింగ్ సీన్.. గోడ బద్దలు కొట్టి చూడగా.. కళ్లు జిగేల్‌మనే సీన్..
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది చాలా మన్నికైన ఇంప్లాంట్’’.. అంటూ కొందరు, ‘‘టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.58 లక్షలకు పైగా లైక్‌లు, 19.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: పామును టార్గెట్ చేసిన డేగ.. తీరా దాడి చేయబోయే సమయంలో షాకింగ్ ట్విస్ట్.. చివరకు..
ఇవి కూడా చదవండి..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 15 , 2024 | 01:27 PM