మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఇలా ఉండడం ఎంతమందికి సాధ్యం.. కష్టంలోనూ ఆనందం వెతుక్కోవడం అంటే ఇదే..

ABN, Publish Date - Apr 24 , 2024 | 04:52 PM

కొందరు ఎంత సంపాదిస్తున్నా.. ఎప్పుడూ టెన్షన్, ఆందోళనతోనే జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. కనీసం ప్రశాంతంగా భోజనం చేయలేని పరిస్థితిలో ఉంటారు. అయితే మరికొందరు మాత్రం ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందుతూ.. రోజూ చేసే కష్టంలోనే సంతోషాన్ని వెతుక్కుంటుంటారు. ఇలాంటి...

Viral Video: ఇలా ఉండడం ఎంతమందికి సాధ్యం.. కష్టంలోనూ ఆనందం వెతుక్కోవడం అంటే ఇదే..

కొందరు ఎంత సంపాదిస్తున్నా.. ఎప్పుడూ టెన్షన్, ఆందోళనతోనే జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. కనీసం ప్రశాంతంగా భోజనం చేయలేని పరిస్థితిలో ఉంటారు. అయితే మరికొందరు మాత్రం ఉన్నదాంట్లోనే సంతృప్తి చెందుతూ.. రోజూ చేసే కష్టంలోనే సంతోషాన్ని వెతుక్కుంటుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు చాలా మందికి ఆదర్శవంతంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేస్తున్న ఎంతో కష్టపడుతూ కూడా సంతోషంగా డాన్స్ చేయడం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇటుకల ఫ్యాక్టరీలో (Brick factory) పని చేస్తుంటాడు. అప్పటికే ఇటుకలు మోసి మోసి.. శరీరం మొత్తం మట్టి అంటుకుని ఉంటుంది. అంత అలసటలోనూ అతను ఎంతో ఖషీగా కనిపించాడు. అందులోనే తన సంతోషాన్ని వెతుక్కోవడమే కాకుండా పక్కన ఉన్న వారిని కూడా ఖుషీ ఖషీగా చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం అమితాబ్ బచ్చన్, గోవిందా.. మఖ్నా (Amitabh Bachchan, Govinda Song) సినిమా పాటకు స్టెప్పులు వేశాడు.

Optical illusion: మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ చిత్రంలో దాక్కున్న కీటకాన్ని 30 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

ఏదో డాన్స్ వేశాం అంటే వేశాం.. అన్నట్లు కాకుండా అందులో లీనమై.. ఎంతో ఫర్‌ఫెక్ట్‌గా స్టెప్పులు వేశాడు. తానే ఆ పాట పాడుతున్నట్లుగా అనిపించేలా నటించాడు. అతడి డాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ చూసి అంతా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇతడు డబ్బులో పేదవాడు కావచ్చు గానీ.. మిగతా అన్ని విషయాల్లో ఎంతో గొప్పవాడు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Wife: చెల్లెలికి టీవీ కొనిచ్చాడని.. భార్య స్కెచ్.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ సీన్..

Updated Date - Apr 24 , 2024 | 04:52 PM

Advertising
Advertising