Viral Video: నిజమైన ‘హార్ట్ బ్రేకింగ్’ అంటే ఇదేనేమో.. మొత్తానికి ఈ వధూవరులు సినిమాను సీన్‌ను మరిపించారుగా..
ABN, Publish Date - Dec 05 , 2024 | 09:55 PM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటన చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ప్రస్తుతం జరుగుతున్నా చాలా వివాహాల్లో వధూవరుల ఎంట్రీ వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా, ఓ పెళ్లిలో..
పెళ్లిళ్లలో వధూవరుల చిత్ర విచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది తమ వివాహాల్లో ఏదో ప్రత్యేకత ఉండేలా చూసుకుంటూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టుగా కెమెరామెన్‌లు కూడా వధూవరులను సినిమాల తరహాలో చూపిస్తున్నారు. వారి ఎంట్రీ దగ్గర నుంచి వివాహం పూర్తయ్యే వరకూ అన్ని ప్రతిదీ సినిమా తరహాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి వినూత్న ఘటనలకు సంబంధించిన వీడియోలను రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘నిజమైన ‘హార్ట్ బ్రేకింగ్’ అంటే ఇదేనేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో చోటు చేసుకున్న ఘటన చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ప్రస్తుతం జరుగుతున్నా చాలా వివాహాల్లో వధూవరుల ఎంట్రీ (bride and groom Entry) వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా, ఓ పెళ్లిలో వధూవరులు సినిమా తరహాలో ఎంట్రీ ఇచ్చారు. ముందుగా స్టేజీపై హృదయం ఆకారంలో ఓ పెద్ద బెలూన్‌ను ఏర్పాటు చేశారు.
Viral Video: కోబ్రా కాటేస్తున్నా పట్టించుకోని కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ఆ బెలూన్ పక్కన సీతా కొత చిలుక తరహాలో దుస్తులు ధరించిన కొంత మంది యువతులు చేతిలో ఎర్ర రంగులో ఉన్న హార్ట్ సింబల్స్‌ను పట్టుకుని ఉంటారు. వాళ్లంతా వాటిని అటూ, ఇటూ ఊపుతూ ఉండగా.. ఉన్నట్టుండి మధ్యలో ఉన్న పెద్ద హార్ట్ బెలూన్ ఒక్కసారిగా పేలిపోతుంది. దాని లోపలి నుంచి వధూవరులు (bride and groom came out after bursting heart balloon) బయటికి వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తారు.
Viral Video: ఫోన్ బిజీలో భర్తకే షాక్ ఇచ్చిందిగా.. పెట్రోల్ బంక్‌లో మరో బైక్ ఎక్కడంతో.. చివరకు..
ఇలా హార్ట్ బెలూన్‌ను బ్రేక్ చేసుకుని బయటికి వచ్చిన ఈ వధూవరులు నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిజమైన హార్ట్ బ్రేకింగ్ అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘సినిమా స్టైల్లో ఎంట్రీ ఇచ్చారుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17వేలకు పైగా లైక్‌లు, 1.3 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇలా ఎవరైనా పడుకుంటారా.. మొత్తానికి ఫైర్ సిబ్బందికే షాక్ ఇచ్చాడుగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 05 , 2024 | 09:55 PM