Viral video: పెళ్లి భోజనంలో కనిపించని చికెన్ లెగ్ పీస్.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
ABN, Publish Date - Jun 25 , 2024 | 07:36 PM
కొన్నిసార్లు గొడవలకు గల కారణాలు చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి. కానీ ఇలాంటి గొడవలు కూడా చివరకు చాలా పెద్ద గొడవలుగా మారుతుంటాయి. వివాహ కార్యక్రమాల్లో ఇలాంటి ..
కొన్నిసార్లు గొడవలకు గల కారణాలు చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి. కానీ ఇలాంటి గొడవలు కూడా చివరకు చాలా పెద్ద గొడవలుగా మారుతుంటాయి. వివాహ కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు కొన్ని వివాహాల్లో చిన్న చిన్న గొడవలు కూడా చివరకు పెళ్లి ఆగిపోయే వరకూ వెళ్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి భోజనం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ప్లేటులో చికెన్ లెగ్ పీస్ కనిపించలేదు. దీంతో చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్తాజ్ బరాత్‌ఘర్‌లో ఇటీవల ఓ వివాహ కార్యక్రమం జరిగింది. వివాహం (marriage) సందర్భంగా వరుడు తన బంధువులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి మంటపానికి చేరుకున్నారు. అతిథుల సమక్షంలో వివాహ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.
Viral video: ఇది కదా స్నేహమంటే.. పాము నుంచి సహచురుడిని కాపాడేందుకు.. ఈ ఉడుత చేసిన పని..
అయితే ఈ సందర్భంగా ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ వైపు వివాహ కార్యక్రమం జరుగుతుండగా.. మరోవైపు మంటపంలో భోజనాలను వడ్డించడం స్టార్ట్ చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వరుడి తరపు వారికి భోజనం వడ్డించే సమయంలో ఓ వ్యక్తికి ప్లేట్‌లో చికెన్ లెగ్ పీస్ (Chicken leg piece) రాలేదు. దీంతో అతను భోజనం వడ్డించిన వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదం కాస్తా.. చివరకు గొడవగా (quarrels) మారింది. విషయం తెలుసుకున్న వరుడు కూడా వారికి తోడవ్వడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. చివరకు రెండు వైపుల వారు కుర్చీలతో కొట్టుకున్నారు.
గొడవ పెద్దది కావడంతో కొందరు పెద్దలు కలుగజేసుకుని వారికి సర్దిచెప్పారు. అయితే వరుడి కుటుంబ సభ్యులు మొదట ఏకంగా పెళ్లినే రద్దు చేసుకోవాలని భావించారు. అయితే పెద్దలంతా కలిసి ఇరు వర్గాలను ఒప్పించడంతో గొడవ సర్దుమణిగి, చివరకు పెళ్లి యథాతథంగా జరిగింది. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘లెగ్ పీస్ తెచ్చిన తంటా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి గొడవ ఎక్కడా చూల్లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral: వివాహానికి ముందు వింత ఒప్పందం.. పెళ్లి తర్వాత కోరిక తీర్చలేకపోయిన భర్త.. చివరకు..
Updated Date - Jun 25 , 2024 | 07:50 PM