Viral Video: ఇష్టం లేకున్నా బలవంతం చేశాడు.. చివరకు వధువు రియాక్షన్ చూసి ఖంగుతిన్నాడు..
ABN, Publish Date - Apr 30 , 2024 | 05:49 PM
ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో విజ్ఞానానికైనా, వినోదానికైనా కొదవే లేకుండా పోయింది. అందులో తమాషా ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇక వివాహాల్లో వధూరుల మధ్య చోటు చేసుకునే సరదా సంఘటనలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా...
ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో విజ్ఞానానికైనా, వినోదానికైనా కొదవే లేకుండా పోయింది. అందులో తమాషా ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇక వివాహాల్లో వధూరుల మధ్య చోటు చేసుకునే సరదా సంఘటనలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వధువుకు ఇష్టం లేకున్నా వరుడు బలవంతంగా రసగుల్లా తినిపించాడు. దీంతో ఆమెకు కోపం కట్టలు తెంచుకుంది. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న సరదా సంఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వేదికపై పూలదండలు మార్చుకున్న వధూవరులు ( bride and groom) .. అందరి ముందూ స్వీట్లు తినించుకుంటుంటాయి. ముందుగా వరుడికి వధువు రసగుల్లా తినిపిస్తుంది. తర్వాత రసగుల్లా (rasgulla) తీసుకున్న వరుడు.. వధువుకు తినిపించే ప్రయత్నం చేస్తాడు. ‘‘స్వీటు తినడం నాకు ఇష్టం లేదు’’.. అన్నట్లుగా వధువు మొఖం పక్కకు తిప్పుకొంటుంది. అయినా వరుడు బలవంతం చేసి, వధువుకు రసగుల్లా తినిపిస్తాడు.
వరుడు బలవంతంగా స్వీటు తినిపించడంతో వధువుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. తన చేతిలో ఉన్న స్వీటు ప్లేటు నేలపై విసిరికొట్టి.. వరుడిని కోపంగా పక్కకు తోసేస్తుంది. దీంతో అతను స్టేజీ కిందకు వెళ్లిపోతాడు. అంతటితో ఆగకుండా వరుడిపై ఆగ్రహంతో ఊగిపోతుంది. ‘‘స్వీటు నాకు ఇష్టం లేదని చెబుతున్నా.. బలవంతంగా తినిపిస్తావా’’.. అంటూ దుర్భాషలాడుతూ వరుడిని కాలితో తన్నుతూ దాడి చేస్తుంది. వరుడిపై ఉమ్మి వేస్తూ బూతులు తిట్టడమే కాకుండా కాలితో పదే పదే తన్నుతూనే ఉంటుంది.
Viral Video: విషపూరిత పామును వెనిగర్‌లో ముంచాడు.. చివరకు గ్లాసులో జ్యూస్ తీసి..
పక్కన ఉన్న వారు ఎంత సర్దిచెబుతున్నా కూడా వధువు మాత్రం శాంతించదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ వధువు కోపం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ వరుడి భవిష్యత్ తలుచుకుంటుంటే బాధగా ఉంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - Apr 30 , 2024 | 05:49 PM