ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral video: అప్పగింతల సమయంలో అందరికీ షాక్ ఇచ్చిన వధువు.. చివరకు చుట్టూ అంతా చేరి..

ABN, Publish Date - Jun 12 , 2024 | 06:51 PM

వివాహ సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు, మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇంకొన్నిసార్లు వధూవరులు ప్రవర్తించే తీరు అందరికీ నవ్వు తెప్పిస్తుంటుంది. మరికొన్నిసార్లు...

వివాహ సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు, మరికొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇంకొన్నిసార్లు వధూవరులు ప్రవర్తించే తీరు అందరికీ నవ్వు తెప్పిస్తుంటుంది. మరికొన్నిసార్లు కంటతడి పెట్టిస్తుంది. మొత్తానికి వివాహానికి సంబంధించిన ఎలాంటి ఘటన అయినా వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అప్పగింతల సమయంలో ఓ వధువు అందరికీ షాక్ ఇచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధువు ఉన్నట్టుండి చిత్రవిచిత్రంగా ప్రవర్తించింది. తాళి కట్టే తంతు ముగిసిన అనంతరం అప్పగింతల సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మహిళంతా కలిసి వధువును అత్తగారింటికి పంపించేందుకు సిద్ధం చేస్తారు. అయితే తీరా ప్రయాణమయ్యే సమయంలో వధువు (crying bride) ఉన్నట్టుండి ఏడుపు మొదలెడుతుంది.

Viral: ఖరీదైన హోటల్లో గది బుక్ చేసుకున్న మహిళ.. ఉదయం లేవగానే తన ఒంటిపై చూసుకోగా.. షాకింగ్ సీన్..


కొద్ది సేపు ఉంటే తానే మనసు మార్చుకుని, ప్రయాణానికి సిద్ధమవుతుందని అంతా అనుకున్నారు. కానీ అందుకు విరుద్ధంగా వధువు తన పుట్టింటి నుంచి అడుగు బయటపెట్టేందుకు ఒప్పుకోలేదు. దీంతో మహిళలంతా చుట్టూ చేరి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వినిపించుకోకుండా తాను వెళ్లనంటూ మొండికేసింది. దీంతో చివరకు వారంతా కలిసి ఆమెను బలవంతంగా వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. అయినా వధువు బిగ్గరగా ఏడుస్తూ వారిని పక్కకు తోసుకుంటూ మళ్లీ ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేసింది.

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న సూదిని 30 సెకన్లలో గుర్తిస్తే.. మీకు కళ్లద్దాలతో పని లేనట్లే..


వధువు బాధను చూసి పక్కన ఉన్న వారంతా కంటతడి పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వివాహం అయిన తర్వాత అత్తగారింటికి వెళ్లడం తప్పదు కదా’’.. అంటూ కొందరు, ‘‘వధువుకు ఎంత బాధగా ఉన్నా.. అత్తింటికి వెళ్లాల్సిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 78 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారిని.. ఈ పోలీసు ఎలా కాపాడాడో చూస్తే..

Updated Date - Jun 12 , 2024 | 06:52 PM

Advertising
Advertising