ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: 'మీకు ఓటేశా, నాకు పెళ్లి చేయండి'.. ఎమ్మెల్యేకు వింత వినతి

ABN, Publish Date - Oct 17 , 2024 | 08:00 PM

ప్రజాప్రతినిధులు కనిపిస్తే తమ ఊరి సమస్యల్ని పరిష్కరించమని వినతులు ఇస్తాం. కానీ ఓ యువకుడు ఎమ్మెల్యేను వింత కోరిక కోరాడు. అతడి కోరిక విన్న ఎమ్మెల్యే షాక్‌కి గురయ్యారు. వారిరువురి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

లఖ్‌నవూ: ప్రజాప్రతినిధులు కనిపిస్తే తమ ఊరి సమస్యల్ని పరిష్కరించమని వినతులు ఇస్తాం. కానీ ఓ యువకుడు ఎమ్మెల్యేను వింత కోరిక కోరాడు. అతడి కోరిక విన్న ఎమ్మెల్యే షాక్‌కి గురయ్యారు. వారిరువురి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ సరదా సంఘటన ఉత్తరప్రదేశ్‌‌లో జరిగింది. చర్ఖారీ నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రిజ్‌భూషణ్‌ రాజ్‌పుత్ తన వాహనంలో వెళ్తూ మహోబా ప్రాంతంలో పెట్రోల్‌ కొట్టించుకునేందుకు ఒక బంక్ వద్ద బండిని ఆపారు. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న అఖిలేంద్ర ఖరే.. ఎమ్మెల్యేను చూసి ఆయన వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. ఏదైనా సాయం కోసం వస్తున్నాడేమో అని బ్రిజ్‌భూషణ్ భావించారు. కానీ అఖిలేంద్ర మాత్రం తాను పెళ్లి చేసుకునేందుకు ఒక అమ్మాయిని చూడాలని అడగడంతో ఒక్కసారిగా ఆ ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. వారిద్దరి మధ్య సంభాషణ జరిగిందిలా..


ఎమ్మెల్యే: నీ వయసెంత..?

అఖిలేంద్ర: త్వరలో 44లోకి వస్తాను

ఎమ్మెల్యే: పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని చూడాలని నన్నేందుకు అడుగుతున్నావు?

అఖిలేంద్ర: నా ఓటు మీకే వేశా.. అందుకే

ఎమ్మెల్యే: అయితే నేను నీకు పెళ్లి చేయాలన్నమాట. మరి ఎలాంటి అమ్మాయి కావాలి?

అఖిలేంద్ర: కొన్ని వర్గాలకు చెందిన వారు వద్దు.

ఎమ్మెల్యే: అలా ఎప్పుడూ వివక్ష చూపకూడదు. ఎవరితో రాసిపెడితే వారితోనే వివాహం జరుగుతుంది. ‘‘నీకు త్వరగా పెళ్లి జరగాలని కోరుకుంటున్నా. నాకు ఓటేశావు కదా.. నా వంతు ప్రయత్నం చేస్తా. ఇంతకీ నీ జీతం ఎంత..?

అఖిలేంద్ర: రూ.6వేల జీతం వస్తుంది. 13 బిగాల భూమి ఉంది.

ఇలా.. వారిద్దరి మధ్య సంభాషణ సాగింది. ఎంతో ఫన్నీగా అనిపించే ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

BJP: హరియాణా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం


Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 17 , 2024 | 08:00 PM