మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: సింహానికి ఝలక్ ఇచ్చిన దున్నపోతు.. చంపాలని శక్తికొద్దీ పరుగెత్తినా.. చివరకు..

ABN, Publish Date - Apr 26 , 2024 | 06:57 PM

అడవి జంతువుల మధ్యలో అప్పడప్పుడూ విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. అపజయమే ఎరుగని పెద్ద పెద్ద జంతువులకు కొన్నిసార్లు ఛేదు అనుభవం ఎదురవుతుంటుంది. పులులు, సింహాలు కూడా అప్పుడప్పుడూ చిన్న చిన్న జంతువుల ముందు తోక ముడవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. మరికొన్నిసార్లు..

Viral Video: సింహానికి ఝలక్ ఇచ్చిన దున్నపోతు.. చంపాలని శక్తికొద్దీ పరుగెత్తినా.. చివరకు..

అడవి జంతువుల మధ్యలో అప్పడప్పుడూ విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. అపజయమే ఎరుగని పెద్ద పెద్ద జంతువులకు కొన్నిసార్లు ఛేదు అనుభవం ఎదురవుతుంటుంది. పులులు, సింహాలు కూడా అప్పుడప్పుడూ చిన్న చిన్న జంతువుల ముందు తోక ముడవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. మరికొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ సింహం, దున్నపోతుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దున్నపోతును ఎలాగైనా తినేయాలని ఓ సింహం తన శక్తికొద్దీ వెంబడించింది. చివరకు ఏమైందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో రెండు దున్నపోతులు కలిసి వెళ్తుంటాయి. అదే సమయంలో అక్కడి గడ్డిలో దాక్కుని ఉన్న ఓ సింహం దూరం నుంచి వాటిని గమనిస్తుంటుంది. తీరా అవి దగ్గరికి రాగానే ఒక్కసారిగా (Lion attack on buffalo) వాటిపై దాడికి దిగుతుంది. సింహం రాకను గమనించిన దున్నపోతులు చెరో దిక్కుకూ పారిపోతాయి. వాటిలో ఓ దున్నపోతును టార్గెట్ చేసి సింహం చివరకు దాని పైకి ఎగిరి కాళ్లతో గట్టిగా పట్టుకుంటుంది.

Optical illusion: మీది డేగ చూపే అయితే.. 20 సెకన్లలో ఈ చిత్రంలో దాక్కున్న దువ్వెనను కనుక్కోండి చూద్దాం..


అయితే దున్నపోతు ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశంతో తన శక్తికి మించి ప్రయత్నిస్తుంది. చివరకు దాని నుంచి విడిపించుకుని అక్కడి నుంచి పరుగందుకుంటుంది. అయితే సింహం కూడా దాన్ని ఎలాగైనా చంపి తినేయాలనే ఉద్దేశంతో దున్నపోతును వేగంగా వెంబడిస్తుంది. మరోవైపు దున్నపోతు కూడా ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని సింహానికి దొరక్కుండా అత్యంత వేగంగా పరుగెడుతుంది. ఈ ఛేజింగ్‌లో చివరకు సింహం వెనక్కు తగ్గుతుంది. దున్నపోతును వెంబడించలేక మధ్యలోనే ఆగిపోతుంది.

Viral Video: ఇది మామూలు కారు కాదుగా..! తలకిందులుగా ఎలా వెళ్తోందని చూస్తే.. షాకింగ్ ట్రిక్..


కాసేపటికి చాలా సింహాలు కలిసి దున్నపోతుల దాడికి దిగుతాయి. అయితే అప్పటికే అక్కడ పదుల సంఖ్యలో దున్నపోతును గుమికూడి ఉంటాయి. దీంతో వాటిని చూడగానే సింహాలన్నీ భయంతో అక్కడి నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తోకముడిచిన సింహాలు’’.. అంటూ కొందరు, ‘‘దున్నపోతు వేగం మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: వరుడి లోపాన్ని తెలివిగా బయటపెట్టిన వధువు.. దండలు మార్చుకుంటుండగా.. ఆమె చేసిన పనికి.. చివరకు..

Updated Date - Apr 26 , 2024 | 06:57 PM

Advertising
Advertising