ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: బీచ్‌లో యువతికి షాక్.. ఎద్దుకు ఆహారం పెట్టాలని చూడగా.. చివరకు..

ABN, Publish Date - May 19 , 2024 | 06:12 PM

జంతువులతో పరాచకాలు ఆడుతూ కొందరు, వాటి పట్ల జాలి కనబరిచే క్రమంలో మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి...

జంతువులతో పరాచకాలు ఆడుతూ కొందరు, వాటి పట్ల జాలి కనబరిచే క్రమంలో మరికొందరు ప్రమాదాలకు గురవడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బీచ్‌లో సరదాగా గడపాలని వెళ్లిన యువతికి ఓ ఎద్దు షాక్ ఇచ్చింది. ఎద్దుకు ఆహారం పెడుతుండగా.. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మెక్సికోలో (Mexico) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి బీచ్‌లో (woman on the beach) తన స్నేహితులతో కలిసి సరదాగా గడుపుతుంటుంది. ఆ సమయంలో ఓ నల్లటి ఎద్దు అటుగా వస్తుంది. ఎద్దు ఆకలిగా ఉండడం గమనించిన ఆమె దానికి ఆహారం పెడుతుంది. అయితే ఆహారం తిన్న తరువాత అది యువతికి సంబంధించిన వస్తువుల్లో ఆహారం ఉందేమో అని వెతుకుతూ ఉంటుంది.

Viral Video: వామ్మో..! గాడిదలో ఇంత ఆవేశమా.. దాడి చేయాలని చూసిన హైనాను..


ఈ క్రమంలో వాటిని చిందరవందరగా పడేస్తుంది. ఇది గమనించిన ఆమె.. తన వస్తువులను పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ఎద్దుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. ఆమెపైకి దూసుకెళ్లి ఒక్కసారిగా కొమ్ములతో ఎత్తి కింద పడేస్తుంది. అంతటితో ఆగకుండా ఆమెపై (bull attacked young woman) పలుమార్లు దాడికి పాల్పడుతుంది. దీంతో యువతి చివరకు ఎటూ కదల్లేక అరుపులు కేకలు పెడుతూ అలాగే ముందుకు పడిపోతుంది. ఈ ఘటనను చూసి అక్కడే ఉన్న వారంతా షాక్ అవుతారు. పరుగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి ఎద్దును పక్కకు తరిమేస్తారు.

Viral Video: ఇదంతా బురదే కదా అనుకుంటే పొరపాటే.. దగ్గరికెళ్లి చూస్తే దిమ్మతిరిగే సీన్..!


ఆ తర్వాత కింద పడిపోయిన యువతి మెల్లగా పైకి లేచి, అక్కడి నంచి పక్కకు వెళ్లిపోతుంది. ఎద్దు దాడిలో ఆమెకు గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ఆకలి తీర్చాలని వెళ్తే ఎంత దారుణం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘కొన్ని ఎద్దుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: స్నేహితురాలి పెళ్లిలో యువకుడి నిర్వాకం.. వధువుకు గిఫ్ట్ ఇచ్చినట్లు ఇస్తూనే ..

Updated Date - May 19 , 2024 | 06:12 PM

Advertising
Advertising