Viral Video: వావ్.. వాటే ట్యాలెంట్.. ఈ కుర్రాడి ట్యాలెంట్ చూస్తే ఆశ్చర్యంతో షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 16 , 2024 | 12:24 PM
చిన్న పిల్లల పరిశీలనా శక్తి, అనుకరణ చాలా గొప్పగా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్న కుర్రాడి మిమిక్రీ చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఆ కుర్రాడు వివిధ బైక్‌లు చేసే సౌండ్‌లను యథాతథంగా దింపేస్తున్నాడు.
పెద్ద వాళ్లతో పోల్చుకుంటే చిన్న పిల్లలు (Child) ఏ విషయం అయినా త్వరగా నేర్చుకుంటారు. వాళ్ల పరిశీలనా శక్తి, అనుకరణ చాలా గొప్పగా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్న కుర్రాడి (Boy) మిమిక్రీ చూస్తే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే. ఆ కుర్రాడు వివిధ బైక్‌లు చేసే సౌండ్‌లను (Bike Sounds) యథాతథంగా దింపేస్తున్నాడు. ఆ బాలుడి ట్యాలెంట్‌కు ఫిదా అయిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కుర్రాడి ప్రతిభకు చాలా మంది ముగ్ధులవుతున్నారు. ridingwitharyan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు ఓ గ్రామంలో తన స్నేహితులతో కలిసి ఉన్నాడు. ఆ ప్రాంతానికి చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆ కుర్రాడితో మాట్లాడాడు. ``ఏయే బైక్‌ల శబ్దాలు చేయగలవు`` అని అడిగాడు. దానికి ఆ కుర్రాడు స్పందిస్తూ.. ``కవాసాకి, బుల్లెట్, హయ్యబుసా`` బైక్‌ల సౌండ్‌లు వినిపిస్తానని చెప్పాడు. ముందుగా కవాసాకి బైక్ ఎలా సౌండ్ చేస్తుందో అచ్చం అలాగే తన నోటితో శబ్దం చేశాడు. ఆ తర్వాత బుల్లెట్, హయ్యబుసా బైక్‌ల సౌండ్లను కూడా వినిపించాడు. అతడి ట్యాలెంట్ చూసిన చుట్టు పక్కల పిల్లలు చప్పట్లతో అభినందించారు. ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా ఆ కుర్రాడిని అభినందించి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. 6.5 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు. ``ఆ కుర్రాడిని ప్రోత్సహిస్తే మంచి మిమిక్రీ కళాకారుడు అవుతాడు``, ``వావ్.. రియల్ ట్యాలెంట్``, ``ఆ కుర్రాడు ఇంకా డెవలప్ కావాలి``, ``గేర్ మార్చాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Ratan Tata: పీవీ నరసింహారావుకు రతన్ టాటా లేఖ.. ఆర్థిక సంస్కరణల గురించి ఏమన్నారంటే..
Optical Illusion: మీ ఐక్యూకు రియల్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న చిన్న తప్పును 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..