Viral Video: కారు ముందుకు వెళ్లకుండా చుట్టుముట్టిన ఆవులు.. ఆసలేం జరిగిందో తెలిస్తే.. వీడియో వైరల్..
ABN, Publish Date - Dec 23 , 2024 | 03:39 PM
మనుషుల్లో మాత్రమే కాదు.. జంతువుల్లో కూడా ఐకమత్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది.
ఒక మనిషికి ఏదైనా ప్రమాదం జరిగితే చుట్టు పక్కల వాళ్లు తమ పనులు ఆపుకుని మరీ వెళ్లి అతడికి సహాయం చేస్తారు. తమకు వీలైనంతగా సహాయపడతారు. మనుషుల్లో మాత్రమే కాదు.. జంతువుల్లో కూడా ఆ ఐకమత్యం (Unity) కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని రాయ్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. కారు (Car) కింద పడిన దూడను రక్షించేందుకు ఆవులు (Cows) కారును చుట్టుముట్టాయి. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌గఢ్ (Raigarh)లో ఈ సంఘటన జరిగింది. బజీ రోడ్డు మీద కొన్ని ఆవులు నిల్చుని ఉన్నాయి. ఆ రోడ్డు మీద వేగంగా వెళ్తున్న ఓ కారు ఒక లేగ దూడను (Calf) ఢీకొట్టింది. సుమారు 200 మీటర్ల వరకు దానిని ఈడ్చుకెళ్లింది. ఆ చిన్న లేగ దూడ ఆ కారు కింద చిక్కుకుపోయింది. ఆ ఘటనను గమనించిన ఆవులు ఆ కారును అడ్డుకుని చుట్టుముట్టాయి. దూడ కోసం ఆ కారు చుట్టూ తిరిగాయి. కారు ముందుకు వెళ్లకుండా నిల్చుండిపోయాయి. ఆ ఆవులను చూసి స్థానికులు స్పందించారు.
కొందరు వ్యక్తులు కలిసి ఆ కారును ఒక వైపు పట్టుకుని పైకి ఎత్తారు. కారు కింద చిక్కుకున్న దూడను సురక్షితంగా బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన దానికి చికిత్స అందించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోను లక్షల మంది వీక్షించారు. ఆ ఘటనపై తమ స్పందనలను తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
Oreo Biscuits: వామ్మో.. ఓరియో బిస్కెట్స్ అంత ప్రమాదకరామా? బిస్కెట్లలో కేన్సర్ కారక రసాయనాలు..?
Viral Video: ఆ యువతి వెంటనే స్పందించకపోతే.. ఊహించడమే కష్టం.. షాకింగ్ వీడియో వైరల్!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 23 , 2024 | 03:39 PM