Share News

Viral Video: కారు ముందుకు వెళ్లకుండా చుట్టుముట్టిన ఆవులు.. ఆసలేం జరిగిందో తెలిస్తే.. వీడియో వైరల్..

ABN , Publish Date - Dec 23 , 2024 | 03:39 PM

మనుషుల్లో మాత్రమే కాదు.. జంతువుల్లో కూడా ఐకమత్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది.

Viral Video: కారు ముందుకు వెళ్లకుండా చుట్టుముట్టిన ఆవులు.. ఆసలేం జరిగిందో తెలిస్తే.. వీడియో వైరల్..
cows surrounded the car

ఒక మనిషికి ఏదైనా ప్రమాదం జరిగితే చుట్టు పక్కల వాళ్లు తమ పనులు ఆపుకుని మరీ వెళ్లి అతడికి సహాయం చేస్తారు. తమకు వీలైనంతగా సహాయపడతారు. మనుషుల్లో మాత్రమే కాదు.. జంతువుల్లో కూడా ఆ ఐకమత్యం (Unity) కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ప్రస్తుతం అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని రాయ్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. కారు (Car) కింద పడిన దూడను రక్షించేందుకు ఆవులు (Cows) కారును చుట్టుముట్టాయి. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది (Viral Video).


ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌గఢ్‌ (Raigarh)లో ఈ సంఘటన జరిగింది. బజీ రోడ్డు మీద కొన్ని ఆవులు నిల్చుని ఉన్నాయి. ఆ రోడ్డు మీద వేగంగా వెళ్తున్న ఓ కారు ఒక లేగ దూడను (Calf) ఢీకొట్టింది. సుమారు 200 మీటర్ల వరకు దానిని ఈడ్చుకెళ్లింది. ఆ చిన్న లేగ దూడ ఆ కారు కింద చిక్కుకుపోయింది. ఆ ఘటనను గమనించిన ఆవులు ఆ కారును అడ్డుకుని చుట్టుముట్టాయి. దూడ కోసం ఆ కారు చుట్టూ తిరిగాయి. కారు ముందుకు వెళ్లకుండా నిల్చుండిపోయాయి. ఆ ఆవులను చూసి స్థానికులు స్పందించారు.


కొందరు వ్యక్తులు కలిసి ఆ కారును ఒక వైపు పట్టుకుని పైకి ఎత్తారు. కారు కింద చిక్కుకున్న దూడను సురక్షితంగా బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన దానికి చికిత్స అందించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోను లక్షల మంది వీక్షించారు. ఆ ఘటనపై తమ స్పందనలను తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ అబ్జర్వేషన్ సూపర్ అయితే.. వీటిల్లో భిన్నమైన ఐస్‌క్రీమ్‌ను 7 సెకెన్లలో పట్టుకోండి..


Oreo Biscuits: వామ్మో.. ఓరియో బిస్కెట్స్ అంత ప్రమాదకరామా? బిస్కెట్లలో కేన్సర్ కారక రసాయనాలు..?


Viral Video: ఆ యువతి వెంటనే స్పందించకపోతే.. ఊహించడమే కష్టం.. షాకింగ్ వీడియో వైరల్!


Optical Illusion Test: మీ దృష్టికి టెస్ట్.. వీటిల్లో భిన్నమైన పుట్టగొడుగును 10 సెకెన్లలో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 23 , 2024 | 03:39 PM