Viral Video: కారుకు పెట్రోల్ కొట్టిన మహిళకు ఊహించని షాక్.. డబ్బుల కోసం ముందు డోరు వద్దకు వెళ్లగా..
ABN, Publish Date - Nov 30 , 2024 | 10:11 AM
మహిళలకు ఇంటా, బయటా మాత్రమే కాకుండా పని చేస్తున్న ప్రదేశాల్లోనూ అనేక రకాల అనుభవాలు ఎదురువుతుంటాయి. కొందరరు భౌతిక దాడులు ఎదుర్కొంటుంటే.. మరికొందరు మానసికంగా చిత్రవధ అనుభవిస్తుంటారు. ఇంకొందరు అనేక రకాలుగా అవమానించబడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి..
మహిళలకు ఇంటా, బయటా మాత్రమే కాకుండా పని చేస్తున్న ప్రదేశాల్లోనూ అనేక రకాల అనుభవాలు ఎదురువుతుంటాయి. కొందరరు భౌతిక దాడులు ఎదుర్కొంటుంటే.. మరికొందరు మానసికంగా చిత్రవధ అనుభవిస్తుంటారు. ఇంకొందరు అనేక రకాలుగా అవమానించబడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి ఘటనలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మహిళలకు సంబంధించిన అనేక రకాల వీడియోలను నిత్యం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారుకు పెట్రోల్ కొట్టిన ఓ మహిళ.. డబ్బుల కోసం ముందు డోరు వద్దకు వెళ్లి నిల్చుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. పెట్రోల్ బంకుల్లో (Petrol station) అప్పుడప్పుడూ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు పెట్రోల్ కొట్టించుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోవడం చూస్తుంటాం. అయితే తాజాగా, ఓ మహిళకు వింత అనుభవం ఎదురైంది. పెట్రోల్ పడుతున్న ఆ మహిళ.. ఓ కారు రాగానే దానిక్కూడా పట్టింది. పెట్రోల్ కొట్టడం పూర్తవగానే యథావిధిగా డబ్బులు తీసుకునేందుకు కారు ముందు డోరు వద్దకు వెళ్లి నిల్చుంది.
Viral Video: బ్యాడ్ టైం అంటే ఇదే.. తేమ తగలకుండా రోడ్డు దాటాలని చూస్తే.. చివరకు..
కారు యజమానికి ఆమె చేతికి డబ్బులు అందించాల్సింది పోయి.. (car owner threw currency notes) అందుకు విరుద్ధంగా ఆమెను అవమానపరుస్తూ కరెన్సీ నోట్లను విసిరేస్తాడు. దీంతో అవి ఆమెకు దూరంగా చెల్లాచెదురుగా పడిపోతాయి. కారు యజమాని చేసిన పనికి ఆమె తీవ్రంగా బాధపడిపోతుంది. అయినా అతన్ని ఒక్క మాట కూడా అనకుండా సైలెంట్‌గా కిందపడిన నోట్లన్నింటినీ ఏరుకుంటుంది. అయితే తీరా పైకి లేవగానే ఒక్కాసరిగా బాధ ఎక్కువై, ముఖానికి చేయి అడ్డు పెట్టుకుని ఏడుస్తుంది.
Viral Video: ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టుకుందో.. వధువుకు స్వాగతం పలికిన వరుడి పరిస్థితి చివరకు..
ఈ ఘటనతో అక్కడే ఉన్న వారంతా తీవ్ర భావవోద్వేగానికి గురవుతారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఈమెను చూస్తుంటే బాధగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘డబ్బు ఉందని ఇంత గర్వం పనికి రాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23వేలకు పైగా లైక్‌లు, 1.67 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 30 , 2024 | 10:11 AM