Viral Video: మెట్లు దిగడానికి బద్ధకించి భవనం పైనుంచి దూకేసిన పిల్లి.. చివరికి ఎవరూ ఊహించని సీన్..
ABN, Publish Date - Dec 08 , 2024 | 09:53 PM
జంతువులు చిత్రవవిచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కుక్కలు, కోతులు, పిల్లులు వంటి జంతువుల ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. కొన్ని మనుషుల్లాగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటే.. మరికొన్ని..
జంతువులు చిత్రవవిచిత్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కుక్కలు, కోతులు, పిల్లులు వంటి జంతువుల ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. కొన్ని మనుషుల్లాగా ప్రవర్తిస్తూ అంతా అవాక్కయ్యేలా చేస్తుంటే.. మరికొన్ని జంతువులు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లి మెట్లు దిగడానికి బద్ధకించి, ఎత్తైన బిల్డింగ్ పైనుంచి దూకేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లి ప్రవర్తించిన తీరు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన భవనం ఎక్కిన పిల్లి దిగే సమయంలో మాత్రం బద్ధకించింది. మెట్లు దిగే ఓపిక లేదో ఏమో గానీ.. చివరకు బిల్డింగ్ అంచున ఉన్న రక్షణ గోడ పైకి ఎక్కింది. చూస్తుండగానే పైనుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించింది.
Viral Video: అయ్యో తాతా.. ఎంత పని జరిగింది.. ఎద్దును తరిమికొట్టాలని చూడగా..
ఈ క్రమంలో కాసేపు తటపటాయించినా.. ఆ తర్వాత ఒక్కసారిగా (cat jumped from the top of the building) పైనుంచి కిందకు దూకేసింది. మధ్యలో విద్యుత్ వైరుకు తగులుకుని గింగిరాలు తిరుగుతూ ధబేల్‌మని కిందపడిపోయింది. అయితే ఈ ఘటనలో పిల్లికి ఎలాంటి గాయాలూ కాలేదు. ఆశ్చర్యకరంగా పైలేచి మళ్లీ అక్కడి నుంచి పరుగందుకుంది. ఈ ఘటనను బిల్డింగ్ పైనుంచి కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Optical illusion: ఈ చిత్రంలో ఆమెతో పాటూ మరో రెండు ముఖాలు ఉన్నాయి.. 15 సెకన్లలో కనుక్కంటే మీరే తోపు..
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పిల్లి దూకుతుంటే వేడుక చూడడం దారుణం’’.. అంటూ కొందరు, ‘‘జంతువుల పట్ల ఇలాంటి పైశాచికత్వం పనికిరాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 32. 5 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో.. ఊపిరి బిగపట్టి చూడాల్సిన వీడియో.. కత్తితో ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 08 , 2024 | 09:53 PM