మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: పిల్లి, ఎలుక మధ్య దొంగాట.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..

ABN, Publish Date - Jun 01 , 2024 | 09:24 PM

పామును చూడగానే ముంగిస, పిల్లిని చూడగానే కుక్క దాడి చేయడం సహజమే. అయితే ఇందులో కొన్నిసార్లు కొన్ని పైచేయి సాధిస్తే.. మరికొన్నిసార్లు ఇంకొన్ని విజయం సాధిస్తుంటాయి. అదేవిధంగా..

Viral Video: పిల్లి, ఎలుక మధ్య దొంగాట.. చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్..

పామును చూడగానే ముంగిస, పిల్లిని చూడగానే కుక్క దాడి చేయడం సహజమే. అయితే ఇందులో కొన్నిసార్లు కొన్ని పైచేయి సాధిస్తే.. మరికొన్నిసార్లు ఇంకొన్ని విజయం సాధిస్తుంటాయి. అదేవిధంగా ఎలుకను చూడగానే పిల్లి కూడా దాడి చేసి చంపేయడం సర్వసాధారణం. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ఎలుకను చూడగానే పిల్లి పరుగెత్తుకుంటూ వచ్చింది. తర్వాత అవి రెండు దొంగాట ఆడుకున్నాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. తలుపు సందులో ఓ ఎలుక దాక్కుని ఉంటుంది. దాన్ని గమనించిన పిల్లి పరుగు పరుగున అక్కడకి వస్తుంది. దాని ఆవేశం చూస్తే.. ఎలుకను ఒక్క దెబ్బతో కొట్టేసి చంపేస్తుందేమో అని అనిపిస్తుంది. అయితే అందుకు విరుద్ధంగా జరిగింది. ఎలుక వద్దకు వచ్చిన పిల్లి.. ‘‘ఏ ఎలుకా.. నిన్ను కనిపెట్టేశా’’.. అన్నట్లగా దాన్ని సుతిమెత్తగా (cat played with rat) రక్కుతూ ఆటలాడుకుంటుంది. పిల్లి చేష్టలకు మొదట భయపడ్డ ఎలుక.. తర్వాత పిల్లి స్నేహం చేస్తోందని గ్రహించి దాంతో కలిసిపోతుంది.

Viral Video: కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం.. చివరకు దాని నిర్వాకం చూస్తే.. షాకే..


ఇలా చాలా సేపు ఆట్లాడుకున్న పిల్లి, ఎలుక.. తర్వాత కలిసి నిద్రపోతాయి. ఎలుకను తన పిల్లల తరహాలో అక్కున చేర్చుకుని, దానిపై తల పెట్టి నిద్రపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరే.. ఇది చాలా విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సీన్ ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, ‘‘ఎలుకపై ప్రేమ కురిపించిన పిల్లి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆటో డ్రైవర్ సమాధానానికి అవాక్కైన యువతి.. ఆటో దిగుతూ ఆమె అడిగిన ప్రశ్నకు..

Updated Date - Jun 01 , 2024 | 09:24 PM

Advertising
Advertising