Viral: ఈ బిర్యానీ వెరీ స్పెషల్ గురూ.. లెగ్ పీస్‌లను బయటికి తీయగా.. చివరకు షాకింగ్ సీన్..
ABN, Publish Date - Sep 15 , 2024 | 08:55 PM
బిర్యానీ అంటే ఇష్టపడని మాంసాహారులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందులోనూ హైదరాబాద్ బిర్యానీకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరి నిర్లక్ష్యం వల్ల మిగతా వారికి చెడ్డ పేరు వస్తోంది. ఇటీవల నగరంలోని కొన్ని హోటళ్లకు చెందిన బిర్యానీ పార్సిళ్లలో..
బిర్యానీ అంటే ఇష్టపడని మాంసాహారులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అందులోనూ హైదరాబాద్ బిర్యానీకి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరి నిర్లక్ష్యం వల్ల మిగతా వారికి చెడ్డ పేరు వస్తోంది. ఇటీవల నగరంలోని కొన్ని హోటళ్లకు చెందిన బిర్యానీ పార్సిళ్లలో వింత వింత వస్తువులు, జీవులు దర్శనమివ్వడం చూస్తున్నాం. అయితే తాజాగా, ఇలాంటి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీలోని లెగ్ పీస్‌లను బయటికి తీయగా.. వాటితో పాటూ వచ్చిన వాటిని చూసి కస్టమర్లు ఖంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్ (Hyderabad) నగంరలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి సచివాలయం నగర్ అతిథి రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్‌కి చెందిన మేఘన తన అన్నయ్య తో కలిసి బిర్యాని తినేందుకు వనస్థలిపురం లోని అతిథి బిర్యాని సెంటర్ వెళ్లింది. బిర్యానీ ఆర్డర్ చేయడంతో కాసేపటికి తీసుకొచ్చి టేబుల్‌పై పెట్టారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేడి వేడి బిర్యానీలో లెగ్ పీస్‌లను తినాలనే ఉద్దేశంతో బయటికి తీసి చూడగా.. అందులో కోడి ఈకలు కూడా దర్శనమిచ్చాయి.
Viral Video: బాలుడు ఫోన్ బిజీలో ఉండగా.. చకచకా భుజంపైకి ఎక్కిన బల్లి.. చివరకు ఏం జరిగిందో చూస్తే..
లెగ్ పీస్‌లతో పాటూ కోడి ఈకలు కూడా కనపడడంతో వారిద్దరూ ఖంగుతిన్నారు. దీనిపై హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగకుండా మేఘన పట్ల దురుసుగా ప్రవర్తించారు. ‘‘ఎవరికి చెప్పుకొంటారో.. చెప్పుకోండి.. మాకూ తెలిసిన వారు చాలా మంది ఉన్నారు’’.. అంటూ దుర్షాషలాడాడు. దీనిపై బాధితులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
Viral Video: చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి దారి తీయొచ్చు.. గణేశుడిని నిమజ్జనం చేస్తుండగా..
ఎల్బీనగర్ జోన్‌లో గతంలో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నా.. GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి హోటళ్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: పాములు ఇలాక్కూడా చేస్తాయా.. గొంతులో ఉబ్బెత్తుగా ఉండడంతో.. ఏంటా అని పరిశీలించగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: రీల్ చేసి మూల్యం చెల్లించుకుంది.. వర్షపు నీటిలో డాన్స్ చేయాలని చూస్తే.. చివరకు..
Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..
Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Sep 15 , 2024 | 08:55 PM