Viral: నేను చేసిన తప్పు మీరు చేయొద్దు.. ఓ తండ్రి ఆవేదన.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
ABN, Publish Date - Dec 28 , 2024 | 11:53 AM
జింకే కదా అనుకుని ఓ తండ్రి తన బిడ్డను దాని ముందు నిలబెట్టాడు. బిడ్డను చూడగానే జింక అతడి పొట్టలో కుమ్మింది. చిన్నారికి ఏమీ కాకపోయినా జనాల మాత్రం తండ్రి మూర్ఖత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తను చేసిన పొరపాటుకు పశ్చాత్తాప పడుతూ ఓ తండ్రి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అతడి తప్పు ఏంటో తెలిసి జనాలు తెగ తిట్టిపోస్తున్నారు. ఇలాంటి తల్లిదండ్రులతో పిల్లలకు ఎప్పటికైనా ముప్పు తప్పదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నెట్టింట ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే (Viral)..
గతేడాది ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి జపాన్‌లో నారా జింకల పార్కుకు వెళ్లాడు. అతడి కుమారుడి వయసు ఐదేళ్లలోపే ఉంటుంది. ఇక ఆ పార్కులో జింకలను స్వేచ్ఛగా తిరగనివ్వడంతో అవి అప్పుడప్పుడూ టూరిస్టుల దగ్గరకు వచ్చి పరిశీలించి వెళుతుంటాయి. ఈ నేపథ్యంలో ఓ జింక తండ్రీకొడుకులను సమీపించింది.
Viral: రైలు అడుగు భాగానికి వేళ్లాడుతూ 290 ప్రయాణం.. టిక్కెట్ లేని ప్రయాణికుడి దుస్సాహసం
చిన్నారిని చూశాక దానికి ఏమనిపించిందో ఏమో తెలీదు కానీ ఒక్కసారిగా ముందుకు ఉరికి బాలుడిని పొట్టలో కుమ్మింది. దీంతో, చిన్నారి సడెన్‌గా కిండపడిపోయాడు. జింక కూడా కంగారు పడి అక్కడి నుంచి పారిపోయింది. ఈ లోపు తండ్రి బిడ్డను లేవనెత్తాడు. అయితే, చిన్నారికి ఎటువంటి దెబ్బలు తగలకపోవడంతో అతడు ఊపిరి పీల్చుకున్నాడు. బిడ్దకు ఏ హానీ జరగనందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు.
నాటి ఘటనల తాలూకు వీడియోను షేర్ చేసిన సదరు వ్యక్తి తానే తప్పు చేశానని వాపోయాడు. ‘‘గతేడాది మేము జపాన్‌లోని జింకల పార్కుకు వెళ్లాము. ఇంతలో జింక మా అబ్బాయిని కుమ్మింది. అతడికి ఏమీ కాలేదు కానీ కాస్త షాకయ్యాడు. ఈ సందర్భంగా నేను తల్లిదండ్రులకు ఒకటి చెప్పదలుచుకున్నా. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను చేసిన తప్పు చేయొద్దు’’ అని అన్నాడు.
Viral: మార్చరీలో జాబ్‌కు వింత పరీక్ష.. శవాల మధ్య 10 నిమిషాల పాటు.
కాగా, అతడు షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఏకంగా 20 కోట్లు వరకూ వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన వారందరూ ఆ తండ్రిని తిట్టిపోశారు. పిల్లల్ని పెంచేది ఇలాగా అంటూ మండిపడ్డారు. ‘‘అడవి జంతువుల సమీపానికి పిల్లల్ని తీసుకెళ్లొచ్చా?’’ అని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. ‘అడవి జంతువులంటే మామూలు విషయం కాదు. అవి ఎప్పుడు ఏం చేస్తాయో తెలీదు’ అని మరో వ్యక్తి చెప్పారు. ‘అడవి జంతువు ముందు పిల్లాడిని నిలబెట్టావు. ఇంతకంటే మూర్ఖపు పని మరొకటి ఉండదు’ అని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.
Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!
Updated Date - Dec 28 , 2024 | 11:58 AM