ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఈ చింపాంజీ తెలివి మామూలుగా లేదుగా.. వంగి నీళ్లు తాగడానికి బద్ధకమేసి.. ఏం చేసిందంటే..

ABN, Publish Date - Apr 14 , 2024 | 08:24 PM

చింపాంజీలు ఎంత తెలివిగా ప్రవర్తిస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనుషుల ప్రవర్తనను మక్కీకి మక్కీ దించడంలో చింపాజీలకు మించిన జంతువు మరోటి లేదని చెప్పొచ్చు. కొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ..

చింపాంజీలు ఎంత తెలివిగా ప్రవర్తిస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనుషుల ప్రవర్తనను మక్కీకి మక్కీ దించడంలో చింపాజీలకు మించిన జంతువు మరోటి లేదని చెప్పొచ్చు. కొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వంగి నీళ్లు తాగడానికి బద్ధకించిన చింపాంజీ చివరకు ఏం చేసిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దాహం వేసిన చింపాంజీ (Chimpanzee) నీళ్లు తాగడానికి ఓ ఊట వద్దకు వెళ్లింది. నీళ్ల పక్కన కూర్చున్న చింపాంజీకి వళ్లు వంచి తాగడానికి బద్ధకమేసింది. దీంతో అటూ ఇటూ చూసింది. చివరకు ఆ పక్కనే ఉన్న ఓ ఫొటోగ్రాఫర్‌ను చూసి దగ్గరికి రమ్మని పిలిచింది. సమీపానికి వెళ్లిన వెంటనే అతడి చేయి పట్టుకుంది. ‘‘నీతో అర్జంట్ పనుంది.. ఇటురా.. వచ్చి కూర్చో’’.. అన్నట్లుగా అతన్ని లాగి కూర్చోబెడుతుంది.

Viral Video: పిల్ల చేష్టలంటే ఇవే.. స్కూటీపై వెళ్తున్న ముగ్గురు.. మధ్యలో కూర్చున్న బాలుడి తుంటరి పనికి..

తర్వాత అతడి రెండు అరచేతులను నీటిలో ముంచి.. తద్వారా (Chimpanzee uses man hands drink water) తన దాహం తీర్చుకుంది. ఇలా నీళ్లు తాగిన తర్వాత.. అతడి చేతులను నీళ్లతో కడిగి శుభ్రపరుస్తుంది. తనకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెబుతున్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ చింపాంజీ తెలివి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇది మనుషులను మించిపోయి నటిస్తోంది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆడ సింహానికి కోపం వస్తే.. మగ సింహానిదీ మగాళ్ల పరిస్థితే.. కావాలంటే ఈ వీడియో చూడండి..

Updated Date - Apr 14 , 2024 | 08:24 PM

Advertising
Advertising