ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: భర్త నుంచి విడాకుల కోసం సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి మాస్టర్ ప్లాన్!

ABN, Publish Date - Dec 26 , 2024 | 01:20 PM

భర్తకు సెక్స్ వర్కర్‌ను ఎరగా వేసి విడాకులు తీసుకోవాలని ప్లాన్ చేసిన ఓ మహిళ చివరకు అడ్డంగా బుక్కైంది. భర్త నిష్కలష్మషమైన మనస్తత్వమే అతడిని కాపాడింది.

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లి పేరిట నాటకం ఆడి భర్త నుంచి డబ్బు దోచుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళ చివరకు అడ్డంగా బుక్కైంది. ఈ కుట్ర వెనకున్న వారందరూ చివరకు కటకటాల పాలయ్యారు. చైనాలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది. భర్తను నేరస్థుడిగా రుజువు చేసి అతడి నుంచి విడాకులు తీసుకునేందుకు జరిగిన ఈ ప్రయత్నం చివరకు బెడిసికొట్టింది (Viral).

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్విజో ప్రావిన్స్ లాంగ్లీ కౌంటీకి చెందిన జియాంగ్, ఆమె బాయ్‌ఫ్రెండ్ లీ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో పరిచయమైన ఇద్దరు వ్యక్తుల సాయం కోరారు. సులువుగా లోన్లు ఇప్పిస్తామని తొలుత చెప్పిన వారు చివరకు ఓ ఫ్రాడ్ పథకాన్ని వాళ్ల ముందుంచారు. తమ ప్రాంతపు సంప్రదాయం ప్రకారం, పెళ్లి సమయంలో వధువుకు వరుడు 1 లక్ష యువాన్లు కన్యాశుల్కంగా చెల్లిస్తారని వివరించారు.

Viral: లగ్జరీ కారులో అకస్మాత్తుగా మంటలు! ‘రేమండ్స్’ అధినేత గుస్సా!


చైనా నిబంధనల ప్రకారం, భర్త తప్పుడు నడక కారణంగా విడాకులు తీసుకున్న భార్య పెళ్లి సమయంలో అతడు చెల్లించిన డబ్బును తిరిగివ్వాల్సిన అవసరం లేదు. దీన్ని అడ్డుగా పెట్టుకుని నిందితులందరూ మహిళ భర్తపై భారీ కుట్రకు తెరదీశారు. ఈ క్రమంలో మహిళ ఓ మాట్రిమోనియల్ సంస్థ ద్వారా బావో అనే వ్యక్తిని వివాహమాడింది. వారు రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు.

Viral: షాకింగ్.. అమెరికా విమానంలో మృతదేహం..

తన వెనక జరుగుతున్న కుట్ర గురించి అసలేమీ తెలీని బావో యథాప్రకారం భార్యకు భారీగా డబ్బు చెల్లించాడు. ఓ ఇంటివాడైనందుకు సంతోష పడ్డాడు. ఈ క్రమంలోనే బావోను మహిళ బాయ్‌ఫ్రెండ్ లీ కలిశాడు. తనని తాను జియాంగ్ బంధువుగా పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత అతడిని సెక్స్ వర్కర్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. లీ బలవంతం చేయడంతో కంగారు పడ్డ బావో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు లీని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు పన్నాగం మొత్తం బయటపడింది.


‘‘మొదట నేను భయపడ్డా, ఈ కుట్రలో భాగం కాలేనని చెప్పా. కానీ వాళ్లు నాపై ఒత్తిడి తెచ్చారు. సమస్యలేమీ ఉండవని బాయ్‌ఫ్రెండ్ కూడా భరోసా ఇచ్చాడు. విడాకుల పని సులువుగా పూర్తవుతుందని అన్నాడు. దీంతో, నేను ఓకే చెప్పా’’ అని నిందితురాలు వాపోయింది. అయితే, ఇవేమీ పట్టించుకోని న్యాయస్థానం నిందితులకు కుట్రలో వారి వారి పాత్రను బట్టి గరిష్ఠంగా మూడేళ్ల వరకూ కారాగార శిక్ష విధించింది.

Viral: ఒకే ట్రిప్‌కు రెండు ఫోన్లలో వేర్వేరు చార్జీల ఆరోపణ.. స్పందించిన ఉబర్

Read Latest and Viral News

Updated Date - Dec 26 , 2024 | 02:00 PM