ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: పట్టుకునే క్రమంలో కాటేసింది.. చికిత్స తీసుకుని వచ్చి కోబ్రాను చూడగా.. షాకింగ్ సీన్..

ABN, Publish Date - Aug 04 , 2024 | 01:28 PM

పాములు పట్టుకునే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చాలా మంది స్నేక్ క్యాచర్లు భయంకరమైన పాములను సైతం ఎంతో చాకచక్యంగా పట్టుకుంటుంటారు. అయితే నాగుపాములు, కింగ్ కోబ్రా వంటి విషపూరితమైన పాములను పట్టుకునే సమయంలో...

పాములు పట్టుకునే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చాలా మంది స్నేక్ క్యాచర్లు భయంకరమైన పాములను సైతం ఎంతో చాకచక్యంగా పట్టుకుంటుంటారు. అయితే నాగుపాములు, కింగ్ కోబ్రా వంటి విషపూరితమైన పాములను పట్టుకునే సమయంలో షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. ఎంత అనుభవం ఉన్న వారైనా అప్పుడప్పుడూ వాటి కాటుకు గురవుతుంటారు. అయితే అదృష్టవశాత్తు కొందరు ప్రాణాపాయం నుంచి బయటపడుతుంటారు. అయితే తాజాగా చోటు చేసుకున్న ఘటన ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పట్టుకునే క్రమంలో ఓ వ్యక్తిని పాము కాటేసింది. అయితే చికిత్స తీసుకుని వచ్చి పామును చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) సాగర్‌లోని నార్యవల్లి పోలీస్ స్టేషన్ ప్రాంత పరిధిలో చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన చంద్రకుమార్ అనే వ్యక్తి పాములు పట్టుకుని, వాటిని తిరిగి సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తుంటాడు. ఇతడికి జూలై 18న ఓ ఫోన్ కాల్ వచ్చింది. నార్యవల్లి ప్రధాన రహదారిలో పాము ఉందని స్థానికులు ఫోన్ చేశారు. దీంతో చంద్రకుమార్ వెంటనే ఆ స్థలానికి చేరుకుని పరిశీలించాడు.

Viral Video: వీళ్లు పిల్లలు కాదు పిడుగులే.. ఒలిపింక్స్‌‌కు పంపిస్తే.. పతకం గ్యారెంటీ..


సంఘటన స్థలంలో సుమారు 5 అడుగుల నాగు పామును గుర్తించి, చివరకు ఎలాగోలా దాన్ని పట్టుకున్నాడు. అయితే పామును పట్టుకునే క్రమంలో (cobra bit the snake catcher) అతడి వేలిపై కాటేసింది. దీంతో స్థానికులు చంద్రకుమార్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకున్న చంద్రకుమార్.. పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. అయితే అతన్ని కాటేసిన పాము చనిపోయిందని స్థానికులు తెలిపారు. దీంతో అసలు ఏం జరిగి ఉంటుందని అంతా వివిధ రకాలుగా ఆలోచిస్తున్నారు.

Viral Video: అయ్యో.. ఇలా జరిగిందేంటీ.. ఎస్కలేటర్ ఎక్కుతుండగా.. ఈ మహిళల ఇబ్బందులు చూస్తే..


చివరకు విచారించగా.. అతడు పామునైతే పట్టుకున్నాడు గానీ.. దాన్ని గాలి తగిలే డబ్బాలో కాకుండా పూర్తిగా మూసి ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. దీంతో ఆ పాము కాసేపటికి (cobra dead due to lack of oxygen) ఆక్సిజన్ అందక చనిపోయిందని తెలిసింది. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘పామును పట్టుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘గాలి చొరబడని బాక్సులో పామును ఉంచడం దారుణం’’.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బాబోయ్.. ఓ వైపు హెవీ రైన్.. మరోవైపు గూడ్స్ ట్రైన్.. సీన్ చూస్తే మతిపోవాల్సిందే..!

Updated Date - Aug 04 , 2024 | 01:32 PM

Advertising
Advertising
<