Viral: పార్లమెంటులో పొగతాగిన మహిళా ఎంపీ.. షాకింగ్ వీడియో వైరల్
ABN, Publish Date - Dec 21 , 2024 | 07:51 PM
కొలంబియా పార్లమెంటులో ఈసిగరెట్ తాగుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఓ మహిళా ఎంపీ ఎక్స్ వేదికగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: కొలంబియా పార్లమెంటులో ఈసిగరెట్ తాగుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఓ మహిళా ఎంపీ ఎక్స్ వేదికగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. పార్లమెంటు కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌గా మారింది. ప్రభుత్వ ఆరోగ్య విధానంపై చర్చ జరుగుతున్న తరుణంలోనే ఆమె వేపింగ్‌కు (ఈసిగరెట్‌తో పొగతాగడం) దిగడంపై ప్రస్తుతం స్థానికంగా రచ్చ రచ్చ జరుగుతోంది (Viral).
Viral: రైలు కిటికీ అద్దాలు పగలగొట్టిన ప్యాసెంజర్లు.. షాకింగ్ దృశ్యాలు వైరల్!
డిసెంబర్ 17న పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఈ ఘటన జరిగింది. కొలంబియా ఆరోగ్య విధానాలను ఎలా మెరుగు పరచాలన్న అంశంపై సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా గ్రీన్ అలయన్స్ పార్టీకి చెందిన ఎంపీ కాథీ జువీనావో పొగ తాగుతూ కెమెరాలకు చిక్కారు. కెమెరాలు తనవైపు లేవనుకుని ఆమె ఈ సెగరెట్ తాగారు. ఇంతలో కెమెరాలు ఆమెవైపు తిరగడంతో గతుక్కుమన్న ఆమె వెంటనే తన చేతిలోని ఈసిగరెట్‌కు టేబుల్ సొరుగులో పెట్టేశారు. పొగను దిగమింగుకునే ప్రయత్నంలో కాస్త దగ్గారు. వేపింగ్‌ను నియంత్రణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇక ఈ సీన్ మొత్తం కెమెరాలో రికార్డవడం నెట్టింట వైరల్ కావడంతో జనాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Viral: శోభనం రాత్రి వధువు కోరిక విని షాక్! పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు
స్వయంగా చట్టసభ సభ్యురాలైన ఆమె పాలనకు సంబంధించిన అత్యున్నత వేదికపై కనీస గౌరవం లేకుండా తన దురలవాటును ప్రదర్శించిన తీరును జీర్ణించుకోలేకపోతున్న పౌరులు తిట్టిపోస్తున్నారు. ఆమె తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విరామం దొరికే వరకూ ఆమె ఆగలేకపోవడం నిజంగా విచారకరమని కొందరు వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి కూడా ఇంతకంటే ఎక్కువ స్వీయ నియంత్రణ ఉంటుందేమో అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు.
ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతుండటంతో సదరు ఎంపీ సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ‘‘నిన్నటి సమావేశాల్లో జరిగిన ఘటనపై నేను ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాను. ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్న ఈ దురలవాటులో నేను భాగం కాదలుచుకోలేదు. ఇది మరోసారి జరగదని మాటిస్తున్నాను’’ అని ఆమె ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!
Updated Date - Dec 21 , 2024 | 07:56 PM