ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: మనువరాలితో కలిసి బస్సు ఎక్కిన మహిళకు షాక్ ఇచ్చిన కండక్టర్.. కారణమేంటని విచారిస్తే..

ABN, Publish Date - Mar 29 , 2024 | 03:42 PM

బస్సు, రైలు ప్రయాణాల్లో మహిళలకు కొన్నిసార్లు చిత్రవిచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా కర్నాటకలో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మనవరాలితో కలిసి బస్సు ఎక్కిన ఆమెకు కండెక్టర్ పెద్ద షాకే ఇచ్చాడు. ఉచిత బస్సులో..

ప్రతీకాత్మక చిత్రం

బస్సు, రైలు ప్రయాణాల్లో మహిళలకు కొన్నిసార్లు చిత్రవిచిత్ర అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా కర్నాటకలో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మనవరాలితో కలిసి బస్సు ఎక్కిన ఆమెకు కండెక్టర్ పెద్ద షాకే ఇచ్చాడు. ఉచిత బస్సులో ఏకంగా రూ.444లు టికెట్ కొట్టడంతో సదరు మహిళ షాక్ అయింది. చివరకు విచారించగా.. కండక్టర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే..

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral news) తెగ వైరల్ అవుతోంది. కర్నాటకలో (Karnataka) శక్తియోజన పథకం కింద మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌలభ్యం (Free travel in government bus) ఉందనే విషయం తెలిసిందే. అయితే ఇటీవల మనువరాలితో కలిసి బస్ ఎక్కిన మహిళకు కండక్టర్ షాక్ ఇచ్చాడు. ఓ మహిళ తన మనువరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూర్ వెళ్లేందుకు ప్రభుత్వ బస్సు ఎక్కింది. వెళ్తూ వెళ్తూ ఆమెతో పాటూ నాలుగు చిలుకలను కూడా పంజరంతో సహా తీసుకెళ్లింది. అయితే బస్సు ఎక్కిన కాసేపటికి కండెక్టర్ ఆమె వద్దకు వచ్చి మొత్తం రూ.444లు టికెట్ కొట్టడంతో సదరు మహిళ షాక్ అయింది. ఉచిత బస్సులో టికెట్ కొట్టడమేంటని అడగ్గా.. మనుషులకు మాత్రమే ఉచితమని.. పక్షులు, జంతువలుకు టికెట్ చెల్లించాల్సిందే అని సమాధానం ఇచ్చాడు.

Viral Video: పెళ్లి మంటపంలో వాటర్ పౌంటెన్‌ని.. ఇంత బాగా ఎవరూ వాడలేరేమో..

ఒక్కో చిలుకకు (parrots) రూ.111లు చొప్పున.. నాలుగు చిలుకలకు కలిసి రూ.444లు టికెట్ చార్జి చేసినట్లు వివరించాడు. ఇది విని సదరు మహిళ ఖంగుతింది. దీనిపై అధికారులు మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే.. వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘‘ఈ కండక్టర్ రూల్స్ పాటించాడు’’.. అంటూ కొందరు, ‘‘పక్షులు, జంతువులను కొన్ని బస్సుల్లో అనుమతించరు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 22వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: చేపలు ఎలా పట్టాలో ఈ పక్షికి బాగా తెలిసినట్టుంది.. కష్టపడకుండా చిన్న టెక్నిక్‌తో...

Updated Date - Mar 29 , 2024 | 03:42 PM

Advertising
Advertising