Viral: భర్తతో ఉన్న వీడియోను షేర్ చేసిన మహిళ.. నెట్టింట ట్రోలింగ్
ABN, Publish Date - Apr 27 , 2024 | 08:18 PM
ఆ జంట నెట్టింట పంచుకున్న వీడియో వైరల్‌గా మారింది. భార్య కంటే భర్త అనాకారిగా ఉన్నందుకు జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా ఇచ్చే గోప్యత పెడ ధోరణులకు దారి తీస్తున్న కాలం ఇది. మన గురించి ఎవరికీ తెలీదులే అనే ధైర్యంతో కొంతమంది ఇష్టారీతిన ట్రోలింగ్‌కు దిగుతుంటారు. అవతలి వారిని హర్ట్ చేస్తున్నామన్న సోయ కూడా లేకుండా నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇందుకు తాజాగా ఉదాహరణగా మరో వీడియో (Viral) వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను ఓ మహిళ నెట్టింట పంచుకుంది. వీడియోలోని ఆమెను భర్తను జనాలు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. అతడి ఊబకాయమే ఇందుకు కారణం.
మహిళ కంటే ఆమె భర్తే అనాకారిగా ఉండటంతో జనాలు అనవసర వ్యాఖ్యానాలకు దిగారు. ఊబయాకంతో ఉన్న అతడిని విపరీతంగా విమర్శించారు. ప్రభుత్వోద్యోగం, ఆస్తి ఉంటే చాలని, జిమ్‌కు వెళ్లి సిక్స్ ప్యాక్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని కొందరు సెటైర్లు వేశారు. వీడియోలో భార్యాభర్తలు అన్యోన్యంగా కనిపించినా జనాలు మాత్రం విపరీత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు (Trolls traget man for his looks).
Viral: భారతీయుడే భర్తగా కావాలంటూ వచ్చిన రష్యా యువతి.. ఎయిర్‌పోర్టులో ఆఫీసర్ చేసిన పనికి..
అయితే, కొందరు మాత్రం ఆ జంటకు మద్దతుగా నిలిచారు. రూపురేఖలు తప్ప మనసు పట్టని నేటి తరానికంటే భిన్నంగా ఉన్న ఈ జంటను అభినందించాలని కొందరు అన్నారు. పైపైమెరుగుల కోసం ఆరాటపడుతూ శాశ్వతమైన బంధాలకు విలువనివ్వని వారికంటే వీరు వంద రెట్లు మెరుగని అభిప్రాయపడ్డారు. నిజమైన ప్రేమ అంటే ఇదే అని మరికొందరు కామెంట్ చేశారు. జీవితంలో నిజమైన ప్రేమ దొరకడం కంటే అదృష్టం మరొకటి ఉండదని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్‌గా మారింది.
Updated Date - May 02 , 2024 | 01:16 PM