ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral video: రోడ్డు దాటుతూ కామెడీ చేస్తున్న ఆవులు.. మధ్యలో తెల్లటి గీతలను చూడగానే..

ABN, Publish Date - Jun 23 , 2024 | 04:57 PM

మనుషులే కాదు కొన్నిసార్లు జంతువులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ నవ్విస్తుంటారు. కుక్కలు, కోతులు, పిల్లలు మనుషులను అనుకరిస్తూ నవ్వించడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి..

మనుషులే కాదు కొన్నిసార్లు జంతువులు కూడా చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ నవ్విస్తుంటారు. కుక్కలు, కోతులు, పిల్లలు మనుషులను అనుకరిస్తూ నవ్వించడం తరచూ చూస్తుంటాం. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఆవుల వీడియో తెగ వైరల్ అవుతోంది. కొన్ని ఆవులు రోడ్డు దాటే క్రమంలో విచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ తెగ నవ్విస్తున్నాయి. రోడ్డుపై తెల్లటి గీతలను చూడగానే అవి చేసిన పని చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మేతకు వెళ్లిన ఆవుల మంద మధ్యలో ఓ రోడ్డు దాటాల్సి వస్తుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు దాటేందుకు ఒకదాని వెనుక మరొకటిగా వెళ్లాయి. అయితే రోడ్డు మధ్యలో ఉన్ తెల్లటి గీతలను చూడగానే.. అవేదో ఎత్తుగా ఉన్న రాళ్లు అనుకున్నాయో (Cows jumped the white lines on road) ఏమో గానీ వెంటనే వాటిని జంప్ చేశాయి.

Viral video: ప్రాణాల మీదకు తెచ్చిన స్టంట్.. ఈ బాలుడికి చివరకు ఏమైందో చూడండి..


ఇలా అన్ని ఆవులూ తెల్లటి గీతల వద్దకు రాగానే ఒక్కసారిగా పైకి ఎగిరి అవతలికి దాటుకున్నాయి. మొత్తం ఆవులన్నీ ఇలాగే చేశాయి. ఇవి చేసిన పనికి అక్కడే ఉన్న వారు తెగ నవ్వుకున్నారు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఆవులు భలే కామెడీ చేస్తున్నాయే’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఆవులు విచిత్రంగా ఉన్నాయే’’.. అంటూ మరికొందరు, విచిత్రంగా ప్రవర్తించిన ఆవుల వీడియోలను షేర్ చేస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: రాత్రివేళల్లో గేదెలు మేయడానికి వీలుగా.. ఈ రైతు చేసిన ఏర్పాట్లు చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - Jun 23 , 2024 | 06:03 PM

Advertising
Advertising