ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఎరను చూసి దగ్గరికొచ్చిన మొసలి.. సడన్‌గా వెనక్కు లాక్కోవడంతో.. చివరకు తిక్కరేగి..

ABN, Publish Date - Jul 27 , 2024 | 08:18 PM

కొందరు పులులు, సింహాలు, మొసళ్లు వంటి వాటితో చెలగాటమాడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. అయినా చాలా మంది ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొందరి విషయంలో చావు తప్పి..

కొందరు పులులు, సింహాలు, మొసళ్లు వంటి వాటితో చెలగాటమాడుతూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. అయినా చాలా మంది ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొందరి విషయంలో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా జరగుతుంటుంది. ఈ తరహా షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొందరు పడవలో చేపల కోసం ఎర వేస్తే చివరకు మొసలి వచ్చింది. అయితే సడన్‌గా వెనక్కు లాక్కోవడంతో చివరకు మొసలి ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు పడవలో చేపల వేటకు వెళ్తారు. నీటిలోకి వెళ్లాక చేపల కోసం ఎర వేస్తారు. అయితే కాసేపు ఎదురు చూడగానే ఏదో కదులుతూ ఎర వద్దకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఏదో పెద్ద చేప పడుతుందని అంతా ఆశపడ్డారు. అయితే నిశితంగా చూడగా.. ఓ పెద్ద మొసలి (crocodile) కనిపించింది.

Viral Video: ఫుట్‌బోర్డ్ ప్రయాణం చేస్తున్నారా.. ఇలాంటి పరిస్థితి మీకూ రావొచ్చు.. ఇతడికేమైందో చూస్తే..


ఎరను చూసి తినేందుకు వేగంగా దగ్గరికి వచ్చింది. దీంతో పడవలోని వారంతా ఎరను వెనక్కు లాక్కున్నారు. అయినా మొసలి ఎలాగైనా ఎరను తినేయాలనే ఉద్దేశంతో దాని వెంబడిస్తూ వచ్చింది. చివరకు ఎరను పడవలోకి లాక్కోగానే మొసలికి అందకుండా పోయింది. దీంతో దానికి తిక్కలేచిందో ఏమో గానీ.. ఒక్కసారిగా పడవ మీదకు దూకి (crocodile attacked boat) వారిపై దాడికి యత్నిస్తుంది.

Viral Video: రోడ్డు మధ్యలో మహిళ వింత నిర్వాకం.. తాంత్రిక పూజలు చేస్తూ.. అంతా చూస్తుండగానే..


అయితే అదృష్టవశాత్తు పడవ వేగంగా వెళ్లడంతో మళ్లీ నీటిలో పడిపోతుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల టైం చాలా బాగుంది’’.. అంటూ కొందరు, ‘‘మొసలితో గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కోతితో పిల్లాడి ఫైట్.. జుట్టూ జుట్టూ పట్టుకుని మరీ కొట్టుకుని.. చివరకు..

Updated Date - Jul 27 , 2024 | 08:18 PM

Advertising
Advertising
<