ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: నీటిలో నుంచి ఒడ్డుకు చేరుకున్న జాగ్వార్.. సడన్‌గా తోక పట్టుకున్న మొసలి.. చివరకు..

ABN, Publish Date - Jul 31 , 2024 | 03:26 PM

పులులు, సింహాలు వంటి క్రూర జంతువులకు కూడా కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణభయంతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంటుంది. ప్రధానంగా ఏనుగులు, నీటి గుర్రాలు, మొసళ్లు ఎదురుపడిన సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి...

పులులు, సింహాలు వంటి క్రూర జంతువులకు కూడా కొన్నిసార్లు షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు ప్రాణభయంతో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంటుంది. ప్రధానంగా ఏనుగులు, నీటి గుర్రాలు, మొసళ్లు ఎదురుపడిన సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నీటిలో నుంచి ఓ జాగ్వార్ ఒడ్డుకు చేరుకునే సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. సడన్‌గా ఓ మొసలి దాని తోక పట్టుకోవడంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. నీటిలోకి దిగిన ఓ జాగ్వార్ తర్వాత అవతలి గట్టుకు చేరుకుంటుంది. తీరా గట్టు మీదకు అడుగు పెట్టగానే ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. నీటిలో నుంచి బయటికి వచ్చిన ఓ భారీ మొసలి (Crocodile attack on jaguar) ఉన్నట్టుండి జాగ్వార్ తోక పట్టుకుంటుంది.

Viral Video: వామ్మో.. వీడికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు.. దొంగతనం చేస్తూనే ఎలా కవర్ చేసుకున్నాడో చూస్తే..


మొసలి తోక పట్టుకోగానే జాగ్వార్ ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది. దాన్నుంచి విడిపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది. అయినా మొసలి మాత్రం దాని తోక వదలకుండా గట్టిగా పట్టుకుని నీటిలోకి లాగేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఉన్న శక్తినంతా కూడగట్టుకుని గట్టిగా విదిలించడంతో ఎట్టకేలకు మొసలి దాని తోకను వదిలేస్తుంది.

Viral Video: స్కూటీ నడపడమే కాదు.. ఎక్కడ బ్రేక్ వేయాలో కూడా తెలియాలి.. ఈ అమ్మాయిలు ఏం చేశారో చూడండి..


ఇలా మొసలి తోక వదిలేయగానే.. బతుకుజీవుడా.. అనుకుంటూ జాగ్వార్.. అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగందుకుంటుంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న పర్యాటకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 40 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈమె అతి తెలివికి దండం పెట్టొచ్చు.. వాషింగ్ మెషిన్‌ను ఎలా వాడిందో చూస్తే..

Updated Date - Jul 31 , 2024 | 03:42 PM

Advertising
Advertising
<