ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కోడిని వెంటాడిన మొసళ్లు.. చివరకు ఏమైందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN, Publish Date - Sep 10 , 2024 | 09:45 PM

మొసళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు మొసళ్లు ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. మరికొన్నిసార్లు ఏంతో ఓపిగ్గా పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా వేటాడేస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ...

మొసళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు మొసళ్లు ఎంతో తెలివిగా వేటాడుతుంటాయి. మరికొన్నిసార్లు ఏంతో ఓపిగ్గా పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా వేటాడేస్తుంటాయి. అయితే అప్పుడప్పుడూ వాటికి కూడా చుక్కలు కనిపిస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొసళ్లు గుంపు కలిసి కోడిని టార్గెట్ చేశాయి. అయితే చివరకు చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. చెరువులోని మొసళ్లన్నీ ఆహారం కోసం ఒడ్డుకు వచ్చి వేచి చూస్తుంటాయి. అయితే వాటికి ఎలాంటి ఆహారం కనిపించదు. అయినా అలాగే వేచి చూస్తూ ఉంటాయి. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఓ కోడి అటుగా వస్తుంది. దాన్ని చూడగానే మొసళ్లకు ప్రాణం లేచొస్తుంది. ఎలాగైనా కోడిని కైమా చేసేయాలని అన్నీ కలిసిట్టుగా ప్లాన్ చేస్తాయి.

Viral Video: ఈ దొంగ తెలివి మామూలుగా లేదుగా.. తాళం తీయకుండానే లాకప్ నుంచి ఎలా వచ్చేశాడో చూడండి..


ముందుగా ఓ మొసలి కోడిని వెంబడిస్తుంది. అయితే కోడి మాత్రం దానికి దొరక్కుండా ముందు ముందుకు పరుగెడుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మొసళ్లన్నీ కోడిని (crocodiles chased the chicken) పట్టుకునే ప్రయత్నం చేస్తాయి. మొసళ్లన్నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కోడి మాత్రం వాటికి దొరక్కుండా అటూ, ఇటూ దూకుతూ చుక్కలు చూపిస్తుంది. ఇలా చాలా సేపు వాటి మధ్య పోటాపోటీ నెలకొంటుంది. అయినప్పటికీ ఆ మొసళ్లు కోడిని ఏమీ చేయలేకపోతాయి.

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..


ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసళ్లకు చుక్కలు చూపించిన మొసళ్లు’’.. అంటూ కొందరు, ‘‘కోడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మూడు పెగ్గులేసిన అంకుల్.. అద్దం ముందు చేసిన నిర్వాకం చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి ఆహారాన్ని లాక్కెళ్లిన డేగ.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. అవాక్కవుతారు..

Viral Video: సోలార్ ప్యానెల్‌ను ఇంత బాగా ఎవరూ వాడలేరేమో.. వరి నాట్లు వేస్తూ ఇతను చేస్తున్న పని చూస్తే..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 10 , 2024 | 09:45 PM

Advertising
Advertising