ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: కెనడాలో మరీ ఇంత దారుణమా.. డబ్బులు చాలక పిజ్జా డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తుంటే..

ABN, Publish Date - Mar 29 , 2024 | 04:33 PM

కెనడాలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న యువకుడు ఇటీవల ఓ కస్టమర్ చేతులో ఎదుర్కొన్న దారుణం అనుభవం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న యువకుడు ఇటీవల ఓ కస్టమర్ చేతులో ఎదుర్కొన్న దారుణం అనుభవం తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, పిజ్జా డెలివరీ చేసేందుకు వచ్చిన దక్షిణాసియాకు చెందిన ఓ వ్యక్తిని కస్టమర్ చాలా ఇబ్బంది పెట్టాడు. క్యాష్ చెల్లిస్తానని అన్న కస్టమర్.. ఏజెంట్ వద్ద చిల్లర లేకపోయినా డబ్బులు తిరిగివ్వాలంటూ పట్టుబట్టాడు (customer abuses Pizza delivery agent).

తన వద్ద చిల్లర లేదని పిజ్జా డెలివరీ ఏజెంట్ ఎంత అభ్యర్థించినా వినలేదు. బిల్లులో క్యాష్ ఆన్ డెలివరీ అని లేకపోవడంతో తాను చిల్లరతో రాలేదని డెలివరీ ఏజెంట్ ఎంత నచ్చ చెప్పినా వినలేదు. వెంటనే ఆఫీసు వాళ్లకు కాల్ చేయాలంటూ ఏజెంట్‌నే వేధించాడు. ఏజెంట్ మందమతి అని, అతడికి బుద్ధి లేదని నానా మాటలూ అన్నాడు. ఏజెంట్ కస్టమర్‌ కేర్‌కు కాల్ చేస్తున్న సమయంలోనూ దుర్భాషలాడటం కొనసాగించాడు.

థియేటర్‌లో సినిమా చూస్తున్న మహిళ.. ముందు సీట్లోని వ్యక్తి చిమ్మ చీకట్లో చేస్తున్నదేంటో చూసి..


చిల్లర తెచ్చి ఇచ్చాక పిజ్జా ఇస్తానని ఏజెంట్ అన్నా కస్టమర్ ఒప్పుకోలేదు. దమ్ముంటే నా చేతిలోంచి పిజ్జా లాక్కుని చూడు అంటూ సవాలు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్‌గా మారడంతో జనాలు షాకైపోతున్నారు. చిన్న విషయానికి ఏజెంట్‌ను ఇంతలా వేధించడం ఏంటని అనేక మంది ప్రశ్నించారు.

పొట్టకూటి కోసం కష్టపడుతున్న ఏజెంట్‌ను మరీ అంతలా ఇబ్బంది పెట్టాలా అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కష్టమర్ల గురించి వెంటనే ఫిర్యాదు చేయాలని కొందరు సూచించారు. పోలీసుల్లాగా డెలివరీ ఏజెంట్లు కూడా షర్టుకు ఓ కెమెరా పెట్టుకుంటే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని అన్నారు.

Spit Stains: ఈ మహిళ కష్టం చూసాకైన జనాల్లో మార్పొస్తుందా? నెటిజన్లను కలచివేస్తున్న వీడియో!

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 29 , 2024 | 04:39 PM

Advertising
Advertising