Share News

Viral: వీడసలు మనిషేనా!? రైలు బయలుదేరగానే డోర్ పక్కన రాడ్ పట్టుకుని..

ABN , Publish Date - Jul 15 , 2024 | 02:59 PM

ముంబై రైల్వే స్టేషన్‌‌లో ఓ యువకుడి ప్రమాదకర స్టంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. వీడియో పాతదేనని కొందరు అంటే ఇలాంటోళ్లు ఇప్పటికీ తారసపడుతున్నారని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Viral: వీడసలు మనిషేనా!? రైలు బయలుదేరగానే డోర్ పక్కన రాడ్ పట్టుకుని..
Dangerous stunt on mumbai local train

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా మోజులో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్నామన్న విషయాన్ని కూడా గుర్తించలేని యువత కోకొల్లలు. అలాంటి ఓ యువకుడి వీడియో ట్రెండింగ్‌లో (Viral) ఉంది. ఇందులో యువకుడు చేసిన దుస్సాహం చూసి జనాలు షాకైపోతున్నారు. వీళ్లల్లో మార్పు ఎప్పుడు వస్తుందో అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తు్న్నారు. ముంబై లోకల్ ట్రైన్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రైలు ఓ యువకుడు రైలు బయలుదేరేముందు ఈ ప్రమాదకర స్టంట్‌కు పూనుకున్నాడు. రైలు డోర్ వద్ద ఉన్న ఇనుప రాడ్లను పట్టుకుని ప్లాట్‌ఫైంపై కాళ్లు అదిమిపెట్టి జారడం మొదలెట్టాడు. రైలు వేగంగ పుంజుకుంటున్నా అలాగే జారుతూ ఉంటే అప్పటికే రైల్లో ఉన్న మరో వ్యక్తి ఈ మొత్తం ఉదంతాన్ని జాగ్రత్తా రికార్డు చేశాడు.

Viral: ఏటా రూ.2 కోట్ల శాలరీ వదులుకున్న యువతి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే..


ప్లాట్‌ఫాం చివరకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎగిరి రైల్లోకి ఎక్కాడు. మరొక్క క్షణం ఆగి ఉంటే ప్లాట్‌ఫాం చివరన ఉన్న గోడ తాకి దుర్మరణం చెందే వాడే! కానీ చావుతో చెలగాటం తనకిష్టమన్నట్టు గోడను సమీపించే వరకూ రైలు పట్టుకుని వేలాడుతూ ప్లాట్‌ఫాంపై జారి చివరి నిమిషంలో ప్రమాకరమైన రీతిలో రైలెక్కాడు (Deadly stunt in Mumbai local train, video of Sewri station going viral on social media).

వీడియోలో ఇదంతా చూసిన జనాలు షాకైపోతున్నారు. ఇతంటి ప్రమాదకరమైన స్టంట్లు ఎందుకు చేస్తుంటారో అని కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, ఈ వీడియో రెండేళ్ల క్రితం నాటిదని కొందరు చెబితే, ఇప్పటికీ ముంబై రైళ్లల్లో ఇలాంటివి చేసే వారు తారసపడుతూనే ఉంటారని కొందరు అన్నారు. రైల్వే పోలీసులు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి వారిని ఆటను సులభంగానే కట్టించొచ్చని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో మరోసారి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Read Viral and Telugu News

Updated Date - Jul 15 , 2024 | 02:59 PM