ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: వీడి తెలివి తగలెయ్య.. పావ్‌భాజీ కోసం ఐఫోన్ అమ్మకానికి

ABN, Publish Date - Mar 16 , 2024 | 05:29 PM

సాధారణంగా చోరులు దొంగతనాలను జల్సాల కోసం చేస్తారు. మరికొందరు ఆకలి బాధతో చేస్తారు. ఇంకొందరు పని దొరక్క చేస్తుంటారు. అలా ఓ దొంగ యాపిల్ ఐఫోన్‌ని దొంగతనం చేశాడు. అది దేనికోసం తాకట్టు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు. పావ్ భాజీ కోసం ఏకంగా ఐఫోన్‌నే అమ్మాడు.

గోవా: సాధారణంగా చోరులు దొంగతనాలను జల్సాల కోసం చేస్తారు. మరికొందరు ఆకలి బాధతో చేస్తారు. ఇంకొందరు పని దొరక్క చేస్తుంటారు. అలా ఓ దొంగ యాపిల్ ఐఫోన్‌ని దొంగతనం చేశాడు. అది దేనికోసం తాకట్టు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు. పావ్ భాజీ కోసం ఏకంగా ఐఫోన్‌నే అమ్మాడు. ఇంతకు ఏమైందంటే.. ఢిల్లీకి చెందిన కార్తికేయ్ అనే వ్యక్తి గోవాకు వెళ్లాడు. అక్కడ ఓ షాపులో ఫుల్లుగా మందు తాగి పడిపోయాడు. అతని జేబులో తళుక్కుమంటూ ఓ ఫోన్ మెరుస్తూ కనిపించింది. దాన్ని గమనించిన ఓ కేటుగాడు మెల్లగా అతని దగ్గరున్న ఐఫోన్‌ను చోరీ చేశాడు.

నిద్రలోంచి తేరుకున్న సదరు వ్యక్తి తన ఫోన్ చోరీకి గురైనట్లు గుర్తించి వెతికాడు. అయినా లాభం లేకుండా పోయింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐఫోన్ చోరీ చేసిన వ్యక్తి ఆకలిగా ఉండటంతో పావ్ భాజీ తినాలనుకున్నాడు. కానీ అప్పటికే అతని దగ్గరున్న డబ్బులు అయిపోయాయి. దీంతో షాపు దగ్గరకు వెళ్లి ఐఫోన్ ఉందని.. అది తీసుకుని పావ్ భాజీ ఇవ్వాలని దుకాణదారుడికి బేరం పెట్టాడు. షాపు యజమాని దాన్ని గమనించి.. ఫోన్‌ని స్వీచ్ ఆన్ చేశాడు. వెంటనే మొబైల్‌కు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఫోన్ ఎత్తగానే.. అవుతలి నుంచి ఫోన్ యజమాని జరిగిన విషయాన్ని చెప్పాడు. చివరికి ఫోన్‌ని యజమానికి చేర్చాడు. ఫోన్ అమ్మిన వ్యక్తికి మతిస్థిమితం లేదని తేలింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated Date - Mar 16 , 2024 | 05:29 PM

Advertising
Advertising