Viral: వామ్మో.. మిల్క్ ప్యాకెట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్ వెనక ఇంత స్టోరీ ఉందా!
ABN, Publish Date - Dec 19 , 2024 | 07:23 PM
మిల్క్ ప్యాక్సెట్స్‌పై ఎక్స్‌పైరీ డేట్ ముద్రించే సంప్రదాయం వెనక ఓ అమెరికన్ గ్యాంగ్‌స్టర్ హస్తముందన్న ఓ ఆసక్తికర కథనం జనాల్లో విస్తృత ప్రచారంలో ఉంది. మరి అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్‌లో దొరికే పాలు ఒక్క రోజుకు మించి నిల్వ చేసుకోలేం. టెట్రా ప్యాక్‌లు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నప్పటికీ వాటికీ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. మరి పాలపై ఎక్స్‌పైరీ డేట్ సంప్రదాయం ఎలా మొదలైందీ అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా? అయితే, దీని వెనక ఓ అమెరికా గ్యాంగ్‌స్టర్ వ్యాపారనైపుణ్యాలు ఉన్నాయంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. మరి ఈ ఆసక్తికర చరిత్ర ఏంటో ఓసారి తెలుసుకుందాం (Viral).
20వ శతాబ్దం తొలి నాళ్లల్లో ఈ సంప్రదాయం మొదలైంది. అప్పట్లో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా పేరుపడ్డ అల్‌కపోన్ ఈ ఒరవడికి తెరతీశారనే కథనం జనబాహుళ్యంలో విస్తృత ప్రచారంలో ఉంది.
Viral Video: బస్సులో ప్రయాణికుడిని 26 సార్లు చెంప ఛెళ్లుమనిపించిన మహిళ!
1920-1933 మధ్య అమెరికాలో మద్యనిషేధం అమల్లో ఉండేది. దీంతో, బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నల్ల వ్యాపారంలో అల్‌కపోన్ భారీగా లాభపడ్డాడు. ఆ తరువాత మద్యనిషేధం ఎత్తేయడంతో బ్లాక్ మార్కెట్ విక్రయాలు తగ్గిపోయాయి. అల్‌కపోన్ ఆదాయం పడిపోయింది. దీంతో, ఇతర ఆదాయ మార్గాల కోసం అన్వేషన మొదలెట్టిన అతడు పాల వ్యాపారంవైపు మళ్లాడు. ఆ కాలంలో పాల వ్యాపారం మంచి లాభసాటి కార్యక్రమంగా పేరు ఉండటంతో అటువేపు మళ్లాడు.
Viral: పబ్లిక్‌గా జంట అధర చుంబనాలు.. మెట్రో స్టేషన్‌లో షాకింగ్ సీన్!
అయితే, అల్‌కపోన్‌కు బాటిళ్లల్లో వివిధ పానయాలు నింపే పరిశ్రమలు కూడా ఉండేవి. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు అతడు పాల బాటిళ్లపై ఎక్స్‌పైరీ డేట్ ముద్రించి ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించాడట. ఈ రోజులోపు వాడేయాలి అని రాసున్న బాటిళ్లల్లో పాలు విక్రయించేవాడట. ఈ మార్కెటింగ్ వ్యూహం జనాలను బాగా ఆకట్టుకోవడం అతడి వ్యాపారం పెరిగిపోయిందట. ఆ తరువాత ఈ ఒరవడి అన్ని ఉత్పత్తులకు క్రమంగా వ్యాపించిందట.
Viral: ఈ ఏనుగుకు ఎంత మర్యాద! తన దారికి అడ్డుగా నిలబడ్డ వ్యక్తిని..
ఇక ప్రచారంలో రెండో కథనం ప్రకారం, అల్‌కపోన్ మేనకోడలు పాడైన పాలు తాగి ఓసారి తీవ్ర అనారోగ్యం పాలైందట. దీంతో, తీవ్రంగా కలత చెందిన అల్‌కపోన్.. పిల్లలు, గర్భిణుల భద్రత కోసం ఆ తరువాత నుంచీ పాల బాటిళ్లపై తప్పనిసరిగా ఎక్స్‌పైరీ డేట్ ముద్రించడం ప్రారంభించాడట. అయితే, అల్‌కపోన్ వ్యాపార ప్రయోజనాల కోసమే ఈ కథనాన్ని కూడా ప్రచారంలోకి తెచ్చారని కొందరు అంటుంటారు. ఈ కథనాల్లో దేన్నీ నిరూపించే ఆధారాలేవీ లేక పోవడం గమనార్హం.
Viral: టీచర్ కష్టం చూసి జనాలు షాక్! ఈ సర్కస్ ఏంటంటూ విమర్శలు!
Updated Date - Dec 19 , 2024 | 07:33 PM