Viral Video: ఓటమి చెందామని తెగ బాధపడిపోతున్నారా.. అయితే ఒక్కసారి ఇతడి కష్టాన్ని చూడండి..
ABN, Publish Date - Dec 10 , 2024 | 09:07 PM
చాలా మంది కాళ్లు, చేతులన్నీ సక్రమంగా ఉన్నా కూడా వాయిదాలు వేస్తూ జీవితాన్ని వృథా చేస్తుంటారు. ఇంకొందరు కష్టాలన్నీ తమకే వస్తున్నాయంటూ తెగ బాధపడిపోతుంటారు. అయితే మరికొందరు మాత్రం చేతులు, కాళ్లు లేకున్నా కుంగిపోకుండా జీవితంలో ధైర్యంగా ముందుకెళ్తుంటారు. ఇలాంటి..
చాలా మంది కాళ్లు, చేతులన్నీ సక్రమంగా ఉన్నా కూడా వాయిదాలు వేస్తూ జీవితాన్ని వృథా చేస్తుంటారు. ఇంకొందరు కష్టాలన్నీ తమకే వస్తున్నాయంటూ తెగ బాధపడిపోతుంటారు. అయితే మరికొందరు మాత్రం చేతులు, కాళ్లు లేకున్నా కుంగిపోకుండా జీవితంలో ధైర్యంగా ముందుకెళ్తుంటారు. ఇలాంటి వారు మిగతా వారందరినీ ఆదర్శంగా నిలుస్తుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చేతులు లేని ఓ వ్యక్తి కష్టపడుతున్న విధానం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రెండు చేతులూ లేవని ఆ యువకుడు కుంగిపోలేదు. చేతులు లేకున్నా మిగతా వారికి ఏమాత్రం తీసిపోనని నిరూపించాడు. అందరితో సమానంగా కష్టపడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కూరగాయలను లోడ్ చేసే పని చేస్తున్న ఆ యువకుడిని చూసి అంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Viral Video: వావ్.. ఈ కోతి ఆటలు మామూలుగా లేవుగా.. ఇంటిపైకి ఎక్కి ఏం చేస్తుందో చూడండి..
కూరగాయలతో నిండిన ప్లాస్టిక్ బకెట్లను తన నోటితో పట్టుకుని (disabled man loading vegetables buckets with his mouth) పైకి ఎత్తి పక్కనే ఉన్న వాహనంలోకి లోడ్ చేస్తున్నాడు. అంత బరువు ఉన్న బకెట్లను సైతం తన నోటితో ఎంతో ఈజీగా ఎత్తేస్తుండడంపై అంతా ఆశశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇతన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి’’.. అంటూ కొందరు, ‘‘చేతులు లేకున్నా ఇలా కష్టపడడం నిజంగా చాలా గ్రేట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.93 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇలాంటి వాడిని ఏం చేయాలి.. వేదికపై యువతి డాన్స్ చేస్తుండగా.. సమీపానికి వెళ్లి..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Dec 10 , 2024 | 09:07 PM