ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రొమాంటిక్‌గా రీల్ చేయాలనుకున్న జంట.. మధ్యలో ఎంటరైన కుక్క.. చివరకు కంపు కంపు చేసిందిగా..

ABN, Publish Date - Jul 26 , 2024 | 02:38 PM

ప్రస్తుత సమాజంలో యువతీయువకల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్‌కు అడిక్ట్ అవుతున్నారు. కొందరు వ్యూస్, లైక్‌ల కోసం నిత్యం రీల్స్ చేస్తుంటే.. మరికొందరు ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే...

ప్రస్తుత సమాజంలో యువతీయువకల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్‌కు అడిక్ట్ అవుతున్నారు. కొందరు వ్యూస్, లైక్‌ల కోసం నిత్యం రీల్స్ చేస్తుంటే.. మరికొందరు ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ జంట రొమాంటిక్‌గా రీల్ చేయాలనే ఉద్దేశంతో రోడ్డు పైకి వెళ్లారు. అయితే మధ్యలో ఎంటరైన కుక్క ఏం చేసిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జంట (couple) రొమాంటిక్‌గా రీల్ (Reel) చేయాలనే ఉద్దేశంతో కారులో ఓ రోడ్డు పైకి వెళ్లారు. కారును రోడ్డు పక్కన ఆపి, ఫోన్ కెమెరా (Phone camera) ఆన్ చేసి రోడ్డుపై పెట్టారు. తర్వాత ఇద్దరూ రోడ్డుకు అవతలి వైపు రొమాంటిక్‌గా నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది.

Viral Video: వరద నీటిలో ఆగిపోయిన కారు.. గమనించిన కుక్క ఎలా సాయం చేసిందో చూడండి..


ఓ కుక్క ఉన్నట్టుండి అటుగా వచ్చింది. కారు వద్దకు వెళ్లి.. సరిగ్గా ఫోన్ ఉన్న ప్రాంతంలో (dog peed on the phone) మూత్రవిసర్జన చేసింది. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న వ్యక్తి షాక్ అయి.. పరుగెత్తుకుంటూ వచ్చి కుక్కను అదిలించి తన ఫోన్ తీసుకున్నాడు. కుక్క రోడ్డు అవతలి వైపునకు వెళ్లి.. చివరకు అతడి వైపు చూసి.. ‘‘రోడ్డుపై రీల్స్ ఏంటన్నా.. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోండి’’.. అన్నట్లుగా ఓ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Viral Video: పాముకు జెర్రికి పవర్‌ఫుల్ ఫైట్.. చివరకు ఏమైందో చూస్తే.. మైండ్ బ్లాకే..


మొత్తానికి రొమాంటిక్‌గా రీల్ చేయాలనుకున్న ఈ జంటకు.. కుక్క ఈ విధంగా షాక్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కుక్కా.. నువ్వు చాలా మంచి పని చేశావ్’’.. అంటూ కొందరు, ‘‘ఫోన్‌ను పాడు చేసిందిగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వైట్ కోబ్రా పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. పామును లోపలికి వదలడంతో.. చూస్తుండగానే..

Updated Date - Jul 26 , 2024 | 02:38 PM

Advertising
Advertising
<