ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కుక్క నటన చూసి మోసపోయాడు.. ప్రేమగా దగ్గరికి తీయడంతో.. చివరకు..

ABN, Publish Date - Sep 07 , 2024 | 07:45 PM

విశ్వాసం చూపించడంలో కుక్కలకు మించిన జంతువు మరోటి లేదు. ఒక్క ముద్ద అన్నం పెట్టినా జీవితాంతం ఇంటిని కాపలాకాస్తుంటాయి. తమ యజమానికి ప్రాణాపాయం ఉందని తెలిస్తే.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతుంటాయి. ఇలాంటి కుక్కలను నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ..

విశ్వాసం చూపించడంలో కుక్కలకు మించిన జంతువు మరోటి లేదు. ఒక్క ముద్ద అన్నం పెట్టినా జీవితాంతం ఇంటిని కాపలాకాస్తుంటాయి. తమ యజమానికి ప్రాణాపాయం ఉందని తెలిస్తే.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుతుంటాయి. ఇలాంటి కుక్కలను నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే కొన్నిసార్లు తిక్క తిక్కగా ప్రవర్తించే కుక్కలను కూడా చూస్తుంటాం. అయితే ప్రేమగా నటించే కుక్కలను మాత్రం ఎప్పుడూ చూసుండం. తాజాగా, ఇలాంటి కుక్క వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎంతో ప్రేమగా దగ్గరికి వచ్చిన కుక్కను చూసి ఓ వ్యక్తి.. అంతే ప్రేమగా దగ్గరికి తీశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డున పక్కన నిల్చుని ఎవరి కోసమో ఎదురు చూస్తుంటాడు. ఇంతలో అక్కడికి ఓ కుక్క వస్తుంది. సమీపంలో నిలబడ్డ కుక్క.. కాసేపటికి ప్రేమగా అతడి వద్దకు వస్తుంది. దీంతో అతను కూడా కుక్కను ఎంతో ప్రేమగా దగ్గరికి తీస్తాడు. కుక్క తలపై ప్రేమగా నిమురుతూ ప్రేమగా చూస్తాడు. ఆ సమయంలో కుక్క కూడా తోక ఆడిస్తూ.. యజమాని పట్ల ఎలాంటి ప్రేమ చూపుతుందో.. అచ్చం అలాగే ప్రవర్తిస్తుంది. ఆ వ్యక్తి ఇలా చాలా సేపు కుక్క తలపై ప్రేమతో నిమురుతాడు.

Optical illusion: వర్షంలో క్యాంపింగ్ కోసం వెళ్తున్న వీరికి.. 20 సెకన్లలో గొడుకు వెతికిపెట్టండి చూద్దాం..


తర్వాత పక్కకు తోలాలని ప్రయత్నించినా అది మాత్రం వెళ్లకుండా అతడి వద్దే ఉంటుంది. అంతటితో ఆగకుండా ఆ తర్వాత దాని ముందు కాళ్లను అతడిపై ఉంచి ఎగబాకుతుంది. తనపై ఇంతలా ప్రేమ చూపించేసరికి ఆ వ్యక్తి కూడా అవాక్కవుతాడు. నవ్వుతూ ఆ కుక్క తలపై ప్రేమతో నిమురుతూ కాసేపటి తర్వాత కిందకు దించి పక్కకు తోలే ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పటిదాకా కామ్‌గా ఉన్న కుక్క కాస్త ఒక్కసారిగా చెలరేగిపోతుంది. అతన్ని గాలి గోర్లతో రక్కుతూ (Dog attack on man) చేతిపై కొరికే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఒక్కసారిగా షాకైన అతను.. ఆ వెంటనే అప్రమత్తమై కుక్కను దూరంగా నెట్టేస్తాడు.

Viral Video: వేట కోసం నీటి ఒడ్డున నక్కిన మొసలి.. ఇంతలో వెనుక నుంచి దూసుకొచ్చిన జాగ్వార్.. చివరకు..


అక్కడే ఉన్న మరో వ్యక్తి కూడా అక్కడికి వచ్చి కుక్కను తరిమికొట్టే ప్రయత్నం చేస్తాడు. దీంతో ఆ కుక్క తర్వాత అక్కడి నుంచి పారిపోతుంది. ఈ దాడిలో అతడికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ప్రస్తుత సమాజంలో మనుషులను చూసి కొన్ని కుక్కలు కూడా ఇలా మారిపోతున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘ఈ కుక్క మిగతా కుక్కలన్నింటికీ చెడ్డ పేరు తెచ్చింది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 16 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆర్టీసీ బస్సును ఆపి.. యువకుడి వింత నిర్వాకం.. వీడియోపై సజ్జనార్ ఏమన్నారంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 07 , 2024 | 07:47 PM

Advertising
Advertising