ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: నరాలు తెగే ఉత్కంఠ.. సింహం, కుక్కల పోటాపోటీ.. సడన్‌గా తెరుచుకున్న గేట్.. చివరకు..

ABN, Publish Date - Aug 14 , 2024 | 03:36 PM

నీటిలో ఉన్న మొసలికి ఎంత బలం ఉంటుందో.. యజమాని ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కకూ అంతే బలం ఉంటుంది. కొన్నిసార్లు బయట పిల్లిగా ఉండే కుక్కలు తన యజమాని ఇంటి ప్రాగణంలోకి వెళ్లగానే పులిగా మారతాయి. ఆ సమయంలో...

నీటిలో ఉన్న మొసలికి ఎంత బలం ఉంటుందో.. యజమాని ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కకూ అంతే బలం ఉంటుంది. కొన్నిసార్లు బయట పిల్లిగా ఉండే కుక్కలు తన యజమాని ఇంటి ప్రాగణంలోకి వెళ్లగానే పులిగా మారతాయి. ఆ సమయంలో మనుషులైనా, జంతువులైనా ఇంట్లోకి అడుపెట్టాలని చూస్తే వారికి ఇక మూడినట్లే. మనుషులే కాదు ఏకంగా సింహమే వచ్చినా వాటికి బెదిరిపోవాల్సిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిదంటే.. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గేటుకు రెండు వైపులా సింహాలు, కుక్కల పోటాపోటీగా తలపడ్డాయి. చివరకు ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌ (Gujarat) సావర్‌కుండ్లాలోని ఓ గోశాలలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే గిర్ నేషనల్ పార్క్ ఉంది. దీంతో ఆ అడవి నుంచి క్రూర జంతువులు ఈ ప్రాంతంలోకి తరచూ చొరబడుతుంటాయి. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి రెండు పెద్ద సింహాలు (lions) గోశాల వైపు వచ్చాయి. గేటు వద్దకు వచ్చిన సింహాలను లోపల ఉన్న కుక్కలు గమనిస్తాయి. ఇంకేముందీ.. గేటు అవతల ఉన్నది సింహాలైనా సరే.. ఏమాత్రం తగ్గకుండా పరుగెత్తుకుంటూ సమీపానికి వచ్చి మొరుగుతాయి.

Viral Video: వరద నీటిలో బైకుపై వెళ్తున్నారా.. అయితే ఇలాక్కూడా జరగొచ్చు.. జాగ్రత్త..


సింహాలు కూడా కుక్కలను చూడగానే వేటాడేందుకు దూకుతాయి. మధ్యలో గేటు ఉండడంతో లోపలికి వెళ్లేందుకు సాధ్యం కాదు. అయినా సింహాలు గేటును బలంగా తన్నుతూ కుక్కలను చూసి గాండ్రిస్తాయి. అయినా కుక్కలు ఏమాత్రం వెనక్కకు తగ్గకుండా (Dogs bark at lions) సింహాల పైకి దూకుతుంటాయి. అయితే ఈ క్రమంలో సింహాల పంజా దెబ్బకు గేటు తెరుచుకుంటుంది. అయితే అప్పిటికే భయపడిపోయిన సింహాలు.. అక్కడగి నుంచి వెళ్లిపోతాయి. గేటు తెరుచుకోగానే ఓ కుక్క అందులో నుంచి బయటికి వచ్చి మరీ మొరుగుతుంది. ఆ సమయంలో సింహాలు దూరంగా వెళ్లిపోవడంతో కుక్క క్షేమంగా బయటపడింది.

Viral Video: ఛీ.. ఛీ.. యవ్వనంగా కనిపించేందుకు ఈమేంటీ ఇలా చేసిందీ.. ముఖానికి ఏం రాసుకుందో తెలిస్తే..


అయితే కాసేపటికి వాటి యజమాని నిద్రలేచి లైటు వేసుకుని అక్కడికి వస్తాడు. గేటు బయటికి వెళ్లి లైటు వేసి అటూ, ఇటూ చూస్తాడు. అయితే సింహాలు వెళ్లిపోవడంతో ఏమీ కనిపించదు. దీంతో చివరకు ఆ వ్యక్తి గేటుకు తాళం వేసి లోపలికి వెళ్లిపోతాడు. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘సింహాలకు చుక్కలు చూపించిన కుక్కలు’’.. అంటూ కొందరు, ‘‘కుక్కల దెబ్బకు భయపడి పారిపోయిన సింహాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 11 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పురి విప్పిన నెమలికి ఇంత పవర్ ఉంటుందా.. వెనుక నుంచి పులి దాడి చేస్తుందనగా.. చివరకు షాకింగ్ ట్విస్ట్..

Updated Date - Aug 14 , 2024 | 03:36 PM

Advertising
Advertising
<