మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: గాడిదతో ఎకసెక్కాలు ఆడితే ఇలాగే ఉంటుంది.. ఇతడి పరిస్థితి ఏమైందో చూడండి..

ABN, Publish Date - Apr 19 , 2024 | 09:45 PM

కొందరు ఎదుటి వారిని హింసిస్తూ పైశాసిక ఆనందం పొందుతుంటారు. ఇంకొందరు నోరు లేని మూగజీవాలను వివిధ రకాలుగా బాధపెడుతూ.. రాక్షసానందం పొందుతుంటారు. అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లు.. కొన్నిసార్లు..

Viral Video: గాడిదతో ఎకసెక్కాలు ఆడితే ఇలాగే ఉంటుంది..  ఇతడి పరిస్థితి ఏమైందో చూడండి..

కొందరు ఎదుటి వారిని హింసిస్తూ పైశాసిక ఆనందం పొందుతుంటారు. ఇంకొందరు నోరు లేని మూగజీవాలను వివిధ రకాలుగా బాధపెడుతూ.. రాక్షసానందం పొందుతుంటారు. అయితే టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు అన్నట్లు.. కొన్నిసార్లు ఇలాంటి వారికి సరైన గుణపాఠం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గాడిదతో ఎగసెక్కాలు ఆడాలని చూశాడు. చివరకు ఏమైందో మీరే చూడండి...


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సైలెంట్‪‌గా ఉన్న ఓ గాడిద వద్దకు వెళ్లిన ఆకతాయి.. గాడిద తోక పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తాడు. దీంతో మొదట గాడిత వెనుక కాలితో అతన్ని తన్నాలని చూస్తుంది. కానీ అతను తప్పించుకుంటూనే.. ఇలా పదే పదే చేతులతో తాకుతూ గాడిదకు కోపం తెప్పిస్తాడు. చాలా సార్లు కాలితో హెచ్చరించిన గాడిద.. చివరకు ఆవేశంగా వెనక్కకు తిరిగి అతడిపైకి దాడికి దిగుతుంది.

Viral Video: ఇలాంటి ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా.. ఈ వీడియో చూశాక.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

గాడిదకు దొరక్కుండా అతను అక్కడి నుంచి వేగంగా పారిపోతాడు. గాడిద కూడా అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో (donkey chased man) చాలా దూరం వెంబడిస్తుంది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా ఆకతాయిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ కొందరు, ‘‘మూగజీవాలను హింసించడం నేరం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 21 మిలియన్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుంది.

Viral Video: వామ్మో..! ఎంత ఎండగా ఉంటే మాత్రం ఇలా ఎవరైనా చేస్తారా.. ఈ విదేశీయుడు రోడ్డుపై చేస్తున్న పని చూస్తే..

Updated Date - Apr 20 , 2024 | 04:10 PM

Advertising
Advertising