ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: సాహసాల ‘డ్రిల్ మ్యాన్’.. ప్రపంచం గుర్తించింది కానీ ప్రభుత్వం గుర్తించలే..!

ABN, Publish Date - Aug 12 , 2024 | 03:20 PM

కూలీ పని చేశాడు. మేస్త్రీ పని చేశాడు. వైన్ షాప్ ముందు బజ్జీలను పొట్లం కట్టే వాడు. ఇలాంటి ఓ సామాన్యుడు.. ఒళ్లు గుగుర్పొడిచే సాహస విన్యాసాలతో ఏకంగా నాలుగు గిన్నిస్ రికార్డులు నెలకొల్పాడంటే ఎవరైనా సరే విస్తుపోక తప్పదు. పనికెర క్రాంతి కుమార్..

Drill Man

హైదరాబాద్, ఆగష్టు 12: కూలీ పని చేశాడు. మేస్త్రీ పని చేశాడు. వైన్ షాప్ ముందు బజ్జీలను పొట్లం కట్టే వాడు. ఇలాంటి ఓ సామాన్యుడు.. ఒళ్లు గుగుర్పొడిచే సాహస విన్యాసాలతో ఏకంగా నాలుగు గిన్నిస్ రికార్డులు నెలకొల్పాడంటే ఎవరైనా సరే విస్తుపోక తప్పదు. పనికెర క్రాంతి కుమార్.. అంటే ఎవ్వరికీ తెలీదు. కానీ 'డ్రిల్ మ్యాన్' అంటే ఇట్టే గుర్తుపడతారు. ఇంతకీ ఆయన చేసిన సాహసాలేంటీ? ఆయన మాటల్లోనే...


‘ఇటలీ దేశంలోని మిలాన్ నగరం.. గిన్నిస్ రికార్డు వేదిక అది. న్యాయనిర్ణేతలు, మూడు వందల మంది ప్రేక్షకులతో అక్కడ సందడి నెలకొంది. పంచె కట్టుకుని ఆ వేదిక మీదకు వెళ్లాను. హైస్పీడ్ టేబుల్ ఫ్యాన్లు తిరుగుతున్నాయి. అరవై సెకన్లలో ఎన్ని ఫ్యాన్లు నాలుకతో ఆపడమన్నదే టాస్క్. నా నాలుకతో ఏకంగా 52 ఫ్యాన్లను ఆపాను. రెండో రికార్డు విషయానికొస్తే.. రెండడుగుల కత్తిని గొంతు లోకి దింపేశా. ఆ కత్తికి తాడు కట్టి ఉంటుంది. ఆ తాడుకే 1944 కిలోలుండే వోక్స్ వ్యాగన్ వాహనం కట్టి ఉంది. అందులో ఎనిమిది మంది జనాలున్నారు. ఆ వాహనాన్ని ఐదు మీటర్లు ముందుకు లాక్కుని పోయినా. ఆ తర్వాత నాలుగు అంగుళాల మేకులను ముక్కులోకి సుత్తితో కొట్టి మళ్లీ బయటకు తీయాలి. ఇలా అరవై సెకన్లలో 22 మేకులు కొట్టాను. చివరగా సలసల కాగే వేడి నూనెలో చికెన్ ముక్కలు ఫ్రై అవుతున్నాయి. కేవలం 60 సెకన్లలో 17 చికెన్ ముక్కలను వట్టి చేత్తో బయటకు తీశా. ఇలా ఏకంగా నాలుగు గిన్నిస్ రికార్డులను సృష్టించా. ప్రపంచంలోనే ఇలాంటి రికార్డులు నెలకొల్పింది నేనొక్కణ్ణి.’


‘‘గిన్నిస్ వేదికపై 32వ ఫ్యాన్ రెక్క నాలుకలోకి దిగబడింది. నొప్పి పుడుతోంది. మళ్లీ ఇక్కడికి రావాలంటే ఎంత సమయం పడుతుందో తెలుసు కాబట్టి.. 70 ఫ్యాన్లు అటెంప్ట్ చేశా. చివరికి 52 ఫ్యాన్లు ఆపినట్లు.. లెక్కగట్టారు. ఇక డ్రిల్ మిషన్ గురించి క్షుణ్ణంగా తెలుసు. ఏ కోణంలో డ్రిల్ చేస్తే మనకు గాయం కాదు.. లాంటివి సాధనతో అర్థమైంది. ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి? లోపలి ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి?.. లాంటి విషయాలపై వేలసార్లు సాధన చేశా.”


ఇదీ నేపథ్యం...

’మా ఊరు యాదాద్రి జిల్లా అడ్డగూడూర్. నాన్న పేరు సత్తయ్య. మేస్త్రీ. అమ్మ పేరు మల్లమ్మ. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. అడ్డగూడూర్ ఏడో తరగతి వరకూ చదివా. ఎనిమిది నుంచి పదో తరగతి వరకూ షాలిగౌడలో చదువుకున్నా. సూర్యాపేటలో ఇంటర్ చదివేప్పుడు.. క్యాటరింగ్ పనికి పోతుంటి. వైన్‌షాప్ ముందు బజ్జీల బండి దగ్గర.. కాలే బజ్జీలను పొట్లం కట్టే పనిలో చేరా. నూనెలోంచి బజ్జీలను తీసీ తీయంగానే.. పేపర్లో వేసి పార్శిల్ కట్టేటోన్ని. అక్కడే అంకెల మామయ్య అని పిలవబడే చంద్రయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి పేర్ని వెంకట్ గౌడ్ పరిచయమయ్యారు. ఒకరు నాలో మనోబలాన్ని నింపితే.. మరొకరు ఆర్థికంగా అండగా నిలిచారు. ఆ సమయంలోనే.. డ్రిల్ మిషన్‌తో ముక్కులో డ్రిల్ చేసే వాణ్ని. నూనెలో డీప్ ఫ్రై అయిన చికెన్ ను తీసేవాణ్ని. ఇవన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ‘ఇండియా గాట్ టాలెంట్’ నుంచి 2014లో ఆఫర్ వచ్చింది. వేదిక మీద బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, నటి మలైకా అరోరా ఉన్నారు. డ్రిల్ మిషన్‌ను ముక్కులో దింపా. కాగే నూనెలో చికెన్ను బయటకు తీశా. ఒళ్లు గుగుర్పొడిచే ఇలాంటి విధ్వంసకర మైన సాహసాలను చూడలేమని నాయ్యనిర్ణేతలు రెడ్ బజర్ కొట్టి నన్ను ఇంటికి పంపించారు. సాహసాలు బాగా చేస్తావని పిలిచి, షో నుంచి వెళ్లగొట్టడంతో బాధపడ్డా. దాంతో టీవీ షోల జోలికే పోలేదు. అయితే ఆ షో వీడియోలు.. యూట్యూబ్లో వైరల్ కావటంతో.. 'డ్రిల్‌మ్యాన్' పేరు ఫిక్స్ చేశారు. అప్పుడే విదేశాల నుంచి కాల్స్ మొదలయ్యాయి. నా జీవితం మలుపు తిరిగింది ఇక్కడే.’


పిచ్చోడన్నారు...

ముక్కులో డ్రిల్ చేయటం, నాలుకతో ఫ్యాన్లను ఆపటం, వేడినూనెలో చికెన్‌ను తీయటంతో పాటు పడుకున్న వ్యక్తి మీద ఉండే వాటర్ మెలన్, కొబ్బరికాయను కత్తితో కొడతా. ఇలా పదుల సాహసాలు చేస్తా. ఇదంతా పదేళ్ల కఠిన శ్రమ. ఉదయం రెండు గంటలు, సాయంత్రం రెండు గంటలపాటు సాధన చేసేవాన్ని. 'పిచ్చోడివిరా... చస్తావు' అన్నారు. కొందరు. తమిళనాడులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు నిపుణులు, యోగా గురువులు మంచి సలహాలు ఇచ్చారు. అన్నామలై విశ్వ విద్యాలయంలో యోగాలో మాస్టర్స్ చేయటానికి సీట్ ఇప్పించారు. వాయు దిగ్బంధనం నేర్చుకోవటానికి నేపాల్ వెళ్లా. శరీరంలోని ప్రతి అవయవాన్ని ఎలా ఉపయోగించాలి? ఇతరులకు ఎలా కనపడుతుంది? ఎలా మనసును, మెదడును నియంత్రణలోకి తెచ్చుకోవాలి? అనే విషయాలపై కఠోర సాధన చేశా. ఇది కూడా తపస్సులాంటిదే. 2015లో 'ఆటా', 'అమెరికా టాలెంట్ షోల నుంచి ఆహ్వానాలు అందాయి. వెంకట్ అన్నతో పాటు కొంతమంది చేసిన సాయంతో అమెరికా వెళ్లా. అక్కడ నా ప్రతిభ చూసిన తర్వాత గిన్నిస్ రికార్డు వాళ్లు నా మీద డాక్యుమెంటరీ తీసుకున్నారు. గిన్నిస్ నిబంధనలు చెప్పారు. అన్నీ రెడీ చేసుకుని ఇటలీకి వెళ్లా. ఏకంగా నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించా. అయినా నన్ను ప్రభుత్వం పట్టించుకోలేదు. క్రికెట్, టెన్నిస్ క్రీడాకారులే మనవాళ్లకు తెలుసు! వేరే దేశస్థులు డిస్కవరీ ఛానల్స్‌లో ఇలాంటివి చేస్తే నెత్తిన పెట్టుకుంటారు. ఏనాటికైనా ఆర్థికంగా బలపడి, ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలన్నదే నా లక్ష్యం”

- రాళ్లపల్లి రాజావలి


Also Read:

ఇంకెన్నాళ్లు వైసీపీ నేతల ఆగడాలు..!

మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయ్: మంత్రి అనిత

బెంగాల్ ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి..

For More Trending News and Telugu News..

Updated Date - Aug 12 , 2024 | 03:26 PM

Advertising
Advertising
<