Viral Video: వావ్..! ఏం ఐడియా బ్రదర్.. వేసవిలో వద్దన్నా కూడా అంతా ఈ ఆటోనే ఎక్కేస్తారు.. ఎందుకంటే..
ABN, Publish Date - Apr 27 , 2024 | 09:02 PM
ప్రస్తుతం ఎండలు ఎంతలా దంచికొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి వెళ్తు్న్నారు. ప్రయాణ సమయాల్లో ఎండల దాటికి అవస్థలు పడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో కొంతమంది వాహనదారులు...
ప్రస్తుతం ఎండలు ఎంతలా దంచికొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటికి వెళ్తు్న్నారు. ప్రయాణ సమయాల్లో ఎండల దాటికి అవస్థలు పడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో కొంతమంది వాహనదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమ వాహనాలకు ఎండ వేడి తగలకుండా అనేక జాగ్రత్తలు తీసుకోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాహనాల వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగేలా ఓ ఆటో డ్రైవర్ చేసిన ఏర్పాట్లు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని తన ఆటోలో చల్లదనం కోసం ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నాడు. చివరకు అతడికి ఓ సూపర్ డూపర్ ఐడియా వచ్చింది. తన ఇంట్లో పక్కన పడేసిన గోనె సంచులను తీసుకొచ్చి ఆటో టాప్‌కు సరిపడా కత్తిరించుకున్నాడు. తర్వాత వాటి మధ్యలో గడ్డి మొలకెత్తేలా ఏర్పాట్లు చేశాడు. తర్వాత ఆ గోనె సంచుల ప్యాక్‌ను ఆటోపై ఫిట్ చేశాడు.
Viral Video: రాత్రి వేళ ఇలాంటి డ్రస్సులు వేసుకుని రోడ్డుపైకి వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో చూడండి..
ఈ ఆటో చూడటానికి ఎంతో అందంగా ఉండడమే కాకుండా ఆటోలో ఉన్న వారికి చల్లదనం కూడా ఇస్తోంది. ఇలా వినూత్నమైన ఆలోచనతో వేసవి ఎండల్లో తాను కూల్ కూల్‌గా ప్రయాణించడమే కాకుండా ప్రయాణికులకూ ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తున్నాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! మీ ఐడియా అద్భుతం బ్రదర్’’... అంటూ కొందరు, ‘‘ఇది మామూలుగా ఆటో కాదు.. ఏసీ ఆటో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5.93లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral: వెతక్కుండానే దొరికేశాయోచ్..! వంట గదిలో మట్టి తవ్వుతుండగా.. జంటను వరించిన అదృష్టం..
Updated Date - Apr 27 , 2024 | 09:02 PM