Viral Video: ఇది మామూలు డ్రైవింగ్ కాదు భయ్యా.. ప్రమాదాన్ని పట్టిగట్టగానే ఇతను చేసిన పని చూస్తే..
ABN, Publish Date - Nov 26 , 2024 | 12:43 PM
వాహనాల డ్రైవింగ్ సమయంలో కొందరు మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ప్రమాదాల సమయంలోనూ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తోటి వారి ప్రాణాలనూ కాపాడుతుంటారు. ఈ క్రమంలో..
వాహనాల డ్రైవింగ్ సమయంలో కొందరు మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు తాము ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ప్రమాదాల సమయంలోనూ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి తోటి వారి ప్రాణాలనూ కాపాడుతుంటారు. ఈ క్రమంలో కొందరు డ్రైవింగ్ చేసే విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా, ఇలాంటి విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారు నడుతున్న ఓ వ్యక్తి తన ముందు ప్రమాదాన్ని పసిగట్టగానే అప్రమత్తమైన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘ ఇది మామూలు డ్రైవింగ్ కాదు భయ్యా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలీదు గానీ.. సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కారు నడుపుతున్న ఓ వ్యక్తికి (Car driver) ఊహించని అనుభవం ఎదురైంది. మార్గమధ్యలో అతను రోడ్డు మలుపు తిరగాల్సి వచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో తనకు ముందు ఓ ట్రక్కు సిలిండర్ల లోడుతో వెళ్తుంటుంది. కారు మలుపు తిరిగి కొద్ది దూరం వెళ్లే సరికి ముందు వైపు ఊహించని ఘటన చోటు చేసుకుంది.
ముందు వెళ్తున్న ట్రక్కులోని సిలిండర్లన్నీ ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాయి. అన్నీ కారు వైపు దొర్లుకుంటూ వచ్చాయి. సిలిండర్ల తన వైపు రావడాన్ని చూసిన కారు డ్రైవర్.. వెంటనే అప్రమత్తమయ్యాడు. వెంటనే తన కారును రివర్స్ చేశాడు. అది కూడా ఎలా చేశాడంటే.. ముందు వైపు ఎలాగైతే వేగంగా నడుపుతారో.. అదే స్థాయిలో రివర్స్ డ్రైవింగ్ కూడా చేసి సిలిండర్లు తనను తాకకుండా జాగ్రత్త పడ్డాడు. చూస్తుండగానే కారును రివర్స్ చేసి, రోడ్డు మలుపు వద్ద నుంచి వచ్చిన దారిలోనే వెనక్కు వెళ్లి సిలిండర్లను తప్పించాడు. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది.
Viral Video: ఓరీ మీ దుంపలు తెగా.. రన్నింగ్ ఆటోలో ఈ పనులేంట్రా నాయనా.. చూశారంటే షాకవ్వాల్సిందే..
ఇలా ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన కారు డ్రైవర్.. అంతా అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి డ్రైవింగ్ నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’’.. అంటూ కొందరు, ‘‘ఈ డ్రైవర్ టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 900కి పైగా లైక్‌లు, 2.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: అదేమైనా మంత్రదండమా.. రోడ్డును ఎలా క్రాస్ చేస్తున్నాడో చూస్తే అవాక్కవుతారు..
ఇవి కూడా చదవండి..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
Viral Video: లగేజీ బ్యాగ్ లేదని ఎవరైనా ఇలా చేస్తారా.. ఇతడి నిర్వాకానికి ఖంగుతిన్న సేల్స్ గర్ల్..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 26 , 2024 | 12:43 PM