ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: తాగుడుకు బానిసైతే పరిస్థితి ఇలా ఉంటుందా.. ఇతడు చేసిన నిర్వాకం చూడండి..

ABN, Publish Date - Aug 09 , 2024 | 09:32 AM

చాలా మంది చెడు అలవాట్లకు బానిసలై చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. చేసేది తప్పని తెలిసినా తమకు తెలీకుండానే వాటికి బానిసలవుతుంటారు. మద్యానికి బానిసైన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటా, బయటా తేడా లేకుండా...

చాలా మంది చెడు అలవాట్లకు బానిసలై చివరకు జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. చేసేది తప్పని తెలిసినా తమకు తెలీకుండానే వాటికి బానిసలవుతుంటారు. మద్యానికి బానిసైన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటా, బయటా తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోవడం చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో వారు చేసే పనులు చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఫుల్‌గా మందు తాగిన ఓ వ్యక్తి రోడ్డుపై చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డు పక్కన మురుగు నీటి గుంటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫుల్‌గా మందు కొట్టిన ఓ మందుబాబు.. రోడ్డుపై వెళ్తున్నాడు. తీరా మురుగు గుంట వద్దకు వచ్చే సరికి మత్తు ఎక్కువైంది. దీంతో చివరకు చొక్కా విప్పేసి మురుగు నీటిలో పడుకుని విశ్రాంతి తీసుకున్నాడు.

Viral Video: ఎంత స్నేహమైతే మాత్రం మరీ ఇదేంటీ.. రెండు రైళ్ల మధ్య వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..


అంతటితో ఆగకుండా మధ్య మధ్యలో మెలకువ వచ్చినప్పుడల్లా మురుగు నీరు నోట్లో పోసుకుని పుక్కిలిస్తున్నాడు. ఇలా చాలా సేపు మురుగు నీటిలో పడుకుని (drunken man resting in the Sewage water) విశ్రాంతి తీసుకున్నాడు. ఇతడి నిర్వాకం చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు తమ కెమెరాల్లో బంధించారు.

Viral Video: ఇలాంటి పడవను ఎక్కడైనా చూశారా.. వర్షం వస్తే దీని పరిస్థితి ఏంటో..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అన్న ఏ బ్రాండ్ కొట్టాడో’’.. అంటూ కొందరు, ‘‘ఈ గొప్పదనం మొత్తం ఆల్కాహాల్‌కే దక్కుతుంది’’.. అంటూ మరికొందరు, ‘‘ఇప్పటి వరకూ ఉన్న అన్ని తాగుబోతు రికార్డులను ఇతను బ్రేక్ చేశాడు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

Updated Date - Aug 09 , 2024 | 09:32 AM

Advertising
Advertising
<