Viral Video: ఇలాంటి నిర్మాణం ఎక్కడైనా చూశారా.. ఇంజినీర్ ఎవరో గానీ సన్మానం చేయాల్సిందే..
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:49 AM
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన నిర్మించిన ఓ ఇంటిని చూసి అంతా అవాక్కవుతున్నారు. రెండస్తుల్లో కట్టిన ఈ ఇల్లు ప్రస్తుతం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఓ వైపు నుంచి చూస్తే అన్ని ఇళ్ల తరహాలోనే కనిపిస్తుంది. కానీ ఇంకో వైపునకు వెళ్లి చూస్తే..
చిత్రవిచిత్ర నిర్మాణాల గురించి చూస్తూనే ఉంటాం. కొందరు తెలివిగా నిర్మాణాలు చేస్తే.. మరికొందరు అతి తెలివితో ఆలోచిస్తూ ఇళ్లను నిర్మిస్తుంటారు. ఈ క్రమంలో ఇంకొందరు తమ ఇళ్లను నిర్మించే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇటీవల ఇలాంటి ఇళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే రోడ్డుకు రెండు వైపులా పిల్లర్స్ వేసి మరీ ఇల్లు కట్టడాన్ని చూశాం. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. తాజాగా, ఇలాంటి విచిత్ర నిర్మాణానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇంజినీర్ ఎవరో గానీ సన్మానం చేయాల్సిందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన నిర్మించిన ఓ ఇంటిని చూసి అంతా అవాక్కవుతున్నారు. రెండస్తుల్లో కట్టిన ఈ ఇల్లు ప్రస్తుతం సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ఓ వైపు నుంచి చూస్తే అన్ని ఇళ్ల తరహాలోనే కనిపిస్తుంది. కానీ ఇంకోవైపునకు వెళ్లి చూస్తే అదే ఇల్లు (triangular house) త్రిభుజాకారంలో కనిపిస్తుంది. సాధారణంగా ఏ ఇల్లు అయినా చతురస్రాకారంలో ఉండడం సర్వసాధారణం.
కానీ ఈ ఇల్లు మాత్రం మరీ విచిత్రంగా త్రిభుజాకరంలో ఉండడంతో అంతా దీని ఆసక్తిగా తిలకిస్తున్నారు. దారిన వెళ్లే వారంతా అక్కడ ఆగి, ఇల్లును తేరిపారా చూసి మరీ వెళ్తున్నారు. దీంతో ఈ ఇల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. గతంలో ఇలాంటి విచిత్ర నిర్మాణాలకు సంబంధించిన వీడియోలను అనేకం చూశాం. రోడ్డుకు ఇరువైపులా పిల్లర్స్‌ను ఏర్పాటు చేసి, దానిపై ఇల్లు కట్టడాన్ని చూశాం. తక్కువ స్థలంలో అత్యంత ఎత్తైన ఇంటిని నిర్మించిన వారిని చూశాం. కోడి ఆకారంలో భవనం నిర్మించి గిన్నిస్ రికార్డ్‌ను సొంతం చేసుకున్న వ్యక్తిని కూడా చూశాం.
అయితే తాజాగా, ఇలా త్రిభుజాకారంలో నిర్మించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి విచిత్రమైన ఇంటిని ఎక్కడా చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఇంజినీర్‌కు సన్మానం చేసి తీరాల్సిందే’’.. అంటూ మరికందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా లైక్‌లు, 7.31 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: సినిమా షూటింగ్ అనుకుంటే పొరబడ్డట్లే.. బైకు ప్రమాదం చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..
ఇవి కూడా చదవండి..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 29 , 2024 | 11:49 AM