Viral Video: ఎంత స్లీపర్ కోచ్ అయితే మాత్రం మరీ ఇదేంటీ.. విచిత్రంగా ఫ్యామిలీ మొత్తం..
ABN, Publish Date - Mar 08 , 2024 | 07:37 PM
రైలు ప్రయాణాలు కొందరికి ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తే.. మరికొందరికి ఛేదు అనుభూతిని మిగుల్చుతుంటాయి. ఇంకొందరికి చికాకును కలిగిస్తుంటాయి. ఇక లోకల్ రైళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికితోడు కొందరు ప్రయాణికులు రైలు బోగీల్లో చిత్రవిచిత్ర పనులన్నీ చేసి ...
రైలు ప్రయాణాలు కొందరికి ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తే.. మరికొందరికి ఛేదు అనుభూతిని మిగుల్చుతుంటాయి. ఇంకొందరికి చికాకును కలిగిస్తుంటాయి. ఇక లోకల్ రైళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనికితోడు కొందరు ప్రయాణికులు రైలు బోగీల్లో చిత్రవిచిత్ర పనులన్నీ చేసి తోటి ప్రయాణికుల ఆగ్రహానికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఫొటో, వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. స్లీపర్ కోచ్‌లో ఓ ఫ్యామిలీ నిర్వాకానికి అంతా అవాక్కయ్యారు.
సోషల్ మీడియాలో ఓ ఫొటోతో పాటూ వీడియో (Viral photo and videos) తెగ వైరల్ అవుతోంది. ఓ స్లీపర్ కోచ్‌లోకి (Sleeper coach) ఎక్కిన ప్రయాణికులు.. ఓ ఫ్యామిలీ నిర్వాకం చూసి అవాక్కయ్యారు. సాధారణంగా రిజర్వేషన్ చేసుకున్న బోగీలో వారికి కేటాయించిన సీట్లలో పడుకుంటారు. ఇంకొందరు స్థలం లేని సమయంలో సీటు సీటు మధ్యలో నేలపై కూడా పడుకోవడం చూస్తుంటాం. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఫ్యామిలీ మాత్రం ఏకంగా బోగీలో తాము ఉంటున్న సీట్లకు ఎదురుగా మొత్తం ఆక్రమించేశారు. చివరకు ప్రయాణికులు అటూ ఇటూ తిరిగేందుకు వీలు లేకుండా దారి మొత్తం బ్లాక్ చేశారు.
Optical illusion: పెయింటింగ్ వేస్తున్న ఈ పిల్లాడి ఫొటోలో పెద్ద తప్పు ఉంది.. అదేంటో చెప్పగలరా..?
బెడ్ రూమ్ తరహాలో ఆ స్థలం మొత్తం ఆక్రమించేసి నిద్రపోయారు. దీంతో అవతలి వైపునకు వెళ్లేందుకు వీలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కొందరు ఈ ఘటనను వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే మరో వ్యక్తికీ విచిత్రం అనుభవం ఎదురైంది. బోగీలో తన సీట్లో పడుకున్న వ్యక్తి.. పక్కన బోగీకి సబంధించిన రేకులు, నట్లు, బోల్టులు ఊడిపోయి.. ప్రమాదకరంగా ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బోగీని కబ్జా చేసిన ఫ్యామిలీ’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో..! ఇలాంటి సీన్.. ఎప్పుడూ చూడలేదు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 8లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో..! ఇదెక్కడి ఆటరా బాబోయ్.. ఏకంగా ఎక్సకవేటర్‌తోనే..
Updated Date - Mar 08 , 2024 | 08:15 PM